-
హిందూపూర్ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, నటునిగా అసంఖ్యాక సినీ అభిమానులను పొందిన వెండితెర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీర్వాద బలం, కీర్తి సంపదల తోడుగా నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను pic.twitter.com/unbwJJREfK
— N Chandrababu Naidu (@ncbn) June 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">హిందూపూర్ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, నటునిగా అసంఖ్యాక సినీ అభిమానులను పొందిన వెండితెర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీర్వాద బలం, కీర్తి సంపదల తోడుగా నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను pic.twitter.com/unbwJJREfK
— N Chandrababu Naidu (@ncbn) June 10, 2021హిందూపూర్ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, నటునిగా అసంఖ్యాక సినీ అభిమానులను పొందిన వెండితెర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీర్వాద బలం, కీర్తి సంపదల తోడుగా నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను pic.twitter.com/unbwJJREfK
— N Chandrababu Naidu (@ncbn) June 10, 2021
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "నటునిగా అసంఖ్యాక అభిమానులను పొందిన వెండితెర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రజల ఆశీర్వాద బలం, కీర్తి సంపదల తోడుగా నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నా." అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
మీ నిస్వార్థ ప్రేమే మాకు ఆదర్శం: లోకేశ్
మావయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కథానాయకునిగా సినీ అభిమానులకు, హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్గా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ నిస్వార్థ ప్రేమను పంచుతున్న మీ ఔదార్యం మాకు ఆదర్శం. మీరిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ అభిమానులు నిత్య సంబరాలు చేసుకునేలా మరెన్నో చిత్రాల్లో, విభిన్న పాత్రల్లో నటించాలని, నిండు నూరేళ్లూ వర్ధిల్లేలా మిమ్మల్ని దీవించమని ఆ దేవుని కోరుకుంటున్నా... అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ భవన్లో బాలకృష్ణ జన్మదిన వేడుకలు...
మంగళగిరి సమీపంలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. నేతలు పాల్గొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పట్టాభిరామ్, బుచ్చి రాంప్రసాద్, దారపనేని నరేంద్రబాబు, వల్లూరు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... దిల్లీ చేరుకున్న సీఎం జగన్.. కాసేపట్లో కేంద్రమంత్రులతో భేటీ!