భారతదేశానికి జాతీయపతాకాన్ని అందించి..తెలుగువారికి పింగళి గౌరవం దక్కించారని తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు. ఆయన పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని గుర్తు చేశారు. ఆ దేశ భక్తునికి నివాళులు అర్పించారు.
మరో ట్వీట్లో నారా లోకేశ్ మహనీయుడైన పింగళి.. అందించిన దేశసేవను ఆయన జయంతి రోజున స్మరించుకుందామని వ్యాఖ్యానించారు. వ్యవసాయ, భూగర్భ, ఖనిజ పరిశోధనల్లో పింగళి ఎంతో కృషి చేశారన్నారు.
ఇవీ చదవండి..త్రివర్ణ పతాక 'జక్కన్న' పింగళి జయంతి నేడు!