తూర్పుగోదావరి జిల్లా తంటికొండ వెంకటేశ్వరాలయం వద్ద జరిగిన ప్రమాదం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లి బృందం ప్రయాణించే వాహనం ప్రమాదానికి గురై పలువురు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు ఉన్నత వైద్యం అందించి, మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రమాదం దురదృష్టకరం: అచ్చెన్న
తంటికొండ రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.
ఇదీ చదవండి: