వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇతర నిపుణులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్‌లో లోపాలవల్లే ఇటలీ, స్పెయిన్‌లో పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. సరైన ప్రణాళికతోనే దక్షిణకొరియా కరోనాను అరికట్టిందని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులను ఐసొలేట్ చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో నిపుణుల సూచనలు
వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడంపై అందరూ దృష్టి పెట్టాలి. పోషకాహారం, విటమిన్లు అందించడం, తదితరాలతో పాటు యోగాభ్యాసంతో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంచుకోవచ్చు -మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్
కరోనా వైరస్ ఎప్పటికప్పుడు వందలాది జన్యు మార్పులను సంతరించుకోవడం వల్ల దానికి విరుగుడు వ్యాక్సిన్ తయారీ దుర్లభంగా మారింది. ఆయుర్వేదంలో దీనికి సరైన విరుగుడుపై పరిశోధనలు చేయడంపై దృష్టి సారించాలి -కార్డియో సర్జన్ డాక్టర్ రవి
హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటు మాస్క్‌లు అనవసరంగా వినియోగించకుండా చూడటంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి - పల్మనాలజిస్ట్ విశాల్
రాష్ట్ర ప్రభుత్వాలు జియో మ్యాపింగ్ యాప్ ద్వారా రియల్ టైమ్‌లో రోగులను ట్రాక్ చేస్తే సులభం అవుతుంది - ఐటీ నిపుణులు