ETV Bharat / city

దాడులను జగనే ప్రేరేపిస్తున్నారు... జోక్యం చేసుకోవాలని గవర్నర్​కు చంద్రబాబు లేఖ

author img

By

Published : Jan 1, 2021, 7:37 AM IST

దౌర్జన్యకాండ, హింసాత్మక దాడులవైపు వైకాపా నేతలను సీఎం జగన్ స్వయంగా ప్రేరేపిస్తున్నారంటూ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. తక్షణమే జోక్యం చేసుకుని పాలనను చక్కదిద్దాలని కోరారు.

cbn letter to governor
గవర్నర్​కు చంద్రబాబు లేఖ
గవర్నర్​కు చంద్రబాబు లేఖ

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వరుస హత్యలు, అత్యాచారాలు, హింసాత్మక దాడులు, బెదిరింపులు, వేధింపులు ఎక్కువ అయ్యాయంటూ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కొందరు పోలీసులు అధికార వైకాపా నాయకులతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల ప్రాణాలకు, జీవనోపాధికి, ఆస్తులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఎన్నికైన వైకాపా ప్రజాప్రతినిధులే ఈ దాడులకు నాయకత్వం వహించడంతో.. ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారని లేఖలో పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులే దాడులకు నాయకులు:

డిసెంబర్ 24న తాడిపర్తి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. కత్తులు, గొడ్డళ్లు, మారణాయుధాలతో తన అనుచరులను వెంటేసుకుని తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడిచేశారని చంద్రబాబు తెలిపారు. ఆయన ఇంట్లో లేకుండా చూసి పట్టపగలే దాడికి పాల్పడ్డారని వివరించారు. పెద్దారెడ్డే స్వయంగా దాడికి నాయకత్వం వహించి.. ప్రభాకర్ రెడ్డి అనుచరుడిని తీవ్రంగా గాయపరిచారన్నారు. అధికార పార్టీకి చెందిన ఎన్నికైన ప్రజాప్రతినిధే బరితెగించి హింసాత్మక దాడులకు తెగబడటం చూస్తుంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులెలా ఉన్నాయో ఊహించుకోవచ్చన్నారు. యూనిఫాంలో ఉన్న పోలీసులు.. ఈ దాడిని ఆపకుండా సహకరించడం, ప్రోత్సహించడం జరిగిందని లేఖలో స్పష్టం చేశారు. సీసీ టీవీ ఫుటేజి సాక్ష్యంగా ఉన్నా ఆందోళనకారులపై కేసులు పెట్టడానికి బదులు.. బాధితులపైనే కేసులు నమోదుచేయడానికి పోలీసులు శ్రద్ద చూపారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వమే వేధిస్తోంది అనడానికి ఈ సంఘటనలే నిదర్శనమన్నారు.

తక్షణమే జోక్యం చేసుకోండి...

హింసాత్మక దాడులు, దౌర్జన్యకాండ వైపు.. వైకాపా నాయకులను సీఎం జగన్ స్వయంగా ప్రేరేపిస్తున్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలతో ప్రజలను.. ప్రత్యేకించి తెదేపా శ్రేణులను భయపెట్టలేరన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, చట్టబద్ద పాలన పూర్తిగా పతనావస్థకు చేరాయని విమర్శించారు. ఈ దాడులు, దౌర్జన్యాలు.. మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను దారుణంగా దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకుని.. రాజ్యాంగాన్ని పరిరక్షించి, పాలనను చక్కదిద్దాలని కోరారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి, ఆయన కుటుంబానికి పూర్తి భద్రత కల్పించి.. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం, రూల్ ఆప్ లా ను అమలు చేయడం, ప్రాథమిక హక్కులను కాపాడటం ద్వారా.. ప్రజల్లో రాజ్యాంగం పట్ల నమ్మకం, ప్రభుత్వం మీద విశ్వాసం పెంచాలని కోరారు. ఈ లేఖతో పాటు 2 వీడియోలను సాక్ష్యాధారాలుగా జతచేసారు.

ఇదీ చదవండి:

దేశంలో కళ తప్పిన నూతన సంవత్సర వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.