రాష్ట్రంలో నరేగా పెండింగ్ బిల్లులన్నింటినీ వైకాపా ప్రభుత్వం చెల్లించే వరకూ న్యాయవాదులు పోరాడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్లో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భవన్లో హైకోర్టు న్యాయవాదుల బృందంతో సమావేశమై నరేగా బిల్లుల చెల్లింపు అంశం చర్చించారు.
నరేగా బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ వైఖరి పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనే విషయాన్ని న్యాయవాదులు చంద్రబాబుకు వివరించారు. రెండేళ్లుగా నరేగా బిల్లలు చెల్లించకపోవటంతో 7 లక్షల మంది ఉపాధి కూలీలు ఇబ్బంది పడ్డారన్నారు. ఉపాధి హామీ పనులు చేసిన వారిపై కక్షసాధింపు చర్యలు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని చంద్రబాబు చెప్పారు.
ఇదీ చదవండి: