ETV Bharat / city

సీఎం​తో సెంచురీ ప్ల్లై బోర్టు ఇండియా సంస్థ సీఎండీ భేటీ... ఎందుకంటే..! - cm jagan latest news

సెంచురి ప్లై బోర్డు ఇండియా సంస్థ సీఎండీ సజ్జన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. కడపజిల్లా బద్వేలులో ఏర్పాటు చేయనున్న ప్లాంట్​కు సంబంధించిన అంశాలపై చర్చించారు.

సీఎం జగన్ తో సెంచురీ ప్ల్లై బోర్టు ఇండియా సంస్థ సీఎండీ సజ్జన్ భేటీ

author img

By

Published : Aug 25, 2021, 8:14 PM IST

సెంచురీ ప్లై బోర్డు ఇండియా సంస్థ సీఎండీ సజ్జన్.... సీఎం జగన్​తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతోపాటు ముఖ్యమంత్రిని కలిశారు. కడప జిల్లా బద్వేలులో ఏర్పాటు చేయనున్న ప్లాంట్​కు సంబంధించిన అంశాలపై చర్చించారు. వెయ్యి కోట్ల రూపాయలతో మూడు దశల్లో.... ప్లై వుడ్ ఉత్పత్తి యూనిట్లను సెంచూరీ సంస్థ ఏర్పాటు చేయనుంది.

డిసెంబర్ 2022 నాటికి మొదటి దశలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమని సంస్థ వెల్లడించింది. ఏడాదికి 4 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని మొదటి విడతగా.... నిర్మాణం పూర్తయ్యాక 10 లక్షల మెట్రిక్ టన్నుల పూర్తిస్ధాయి సామర్ధ్యంతో ఉత్పత్తి చేయనున్నట్టు సీఎంకు తెలిపారు. బద్వేలు యూనిట్​లో 3వేల మందికి ఉపాధి కల్పించనున్నట్టు సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. తమ యూనిట్ ద్వారా యూకలిప్టస్ రైతులకు కూడా మేలు జరుగుతుందన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.