ETV Bharat / city

Centre On AP Govt Loans: పరిధికి మించి ఏపీ రుణాలు తీసుకుంది: కేంద్రం - ఏపీ రుణాలపై కేంద్రం ప్రకటన

Centre On AP Govt Loans
Centre On AP Govt Loans
author img

By

Published : Dec 20, 2021, 6:59 PM IST

Updated : Dec 20, 2021, 7:32 PM IST

18:54 December 20

వచ్చే మూడేళ్లలో రుణ సేకరణపై ఆంక్షలున్నాయి: కేంద్ర ఆర్థికశాఖ

ఎఫ్ఆర్‌బీఎం పరిధికి మించి ఏపీ రుణాలు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. పరిమితికి మించి రూ.17,924 కోట్ల రుణాలు పొందినట్లు పేర్కొంది. ఫలితంగా వచ్చే మూడేళ్లలో రుణ సేకరణపై ఆంక్షలున్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీలు కేశినేని, రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ జవాబునిచ్చింది. అధికంగా తీసుకున్న రుణాలను మూడేళ్లలో సర్దుబాటు చేసేలా ఏపీకి అవకాశమిచ్చామని తెలిపింది. ఎఫ్ఆర్‌బీఎం కన్నా తక్కువ రుణాలు తీసుకోవాలని ఆంక్షలు కూడా విధించినట్లు ప్రస్తావించింది.

వాటి కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం : కేంద్రం
centre on Kakinada - Srikakulam Gas Pipeline: కొవిడ్ కారణంతో పాటు వర్షాల కారణంగా కాకినాడ - విశాఖ - శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ.. రాజ్యసభకు తెలిపింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు.. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాకినాడ-వైజాగ్-శ్రీకాకుళం మధ్య సహజవాయువు పైప్ లైన్ నిర్మాణానికి పెట్రోలియం, నాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు 2014 జూలై 16న.. ఏపీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ను అనుమతించినట్లు మంత్రి చెప్పారు. కేఎస్‌పీఎల్‌ పైప్‌ లైన్‌ ప్రాజెక్ట్‌లోని కాకినాడ-వైజాగ్‌ సెక్షన్‌ను 2021 జూన్‌ 30 నాటికి, వైజాగ్‌-శ్రీకాకుళం సెక్షన్‌ను 2022 జూన్‌ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కానీ కొవిడ్‌ మహమ్మారి విజృంభణ, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పైప్‌ లైన్‌ నిర్మాణ పనుల్లో జాప్యం ప్రస్తావించారు.

ఏపీ నుంచి 9 జిల్లాలు - పార్లమెంట్​లో కేంద్రం ప్రకటన
centre on jal shakti abhiyan: దేశంలో నీటి కొరతను ఎదుర్కొంటున్న 256 జిల్లాల్లో జల సంరక్షణ, జల వనరుల నిర్వహణను ప్రోత్సహించేందుకు కేంద్రం మొదలు పెట్టిన జలశక్తి అభియాన్‌ (జేఎస్‌ఏ)లో ఆంధ్రప్రదేశ్​ నుంచి 9 జిల్లాలను ఎంపిక చేసినట్లు కేంద్ర జలశక్తి శాఖ.. పార్లమెంటులో తెలిపింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు సమాధానం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్‌ కడప జిల్లాలను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. జేఎస్‌ఏ కింద చేపట్టే కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు, భూగర్భజల నిపుణులు, శాస్త్రవేత్తలు ఆయా రాష్ట్ర, జిల్లాల అధికారులతో కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు. వర్షాన్ని వడిసి పట్టాలి అనే నినాదంతో ప్రారంభించిన జల శక్తి అభియాన్‌లో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటిని వడిసి పట్టేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో కొనసాగే కార్యక్రమంలో భాగంగా 2021 మార్చి నుంచి నవంబర్‌ వరకు వర్షాలకు ముందు, వర్షాకాలంలోనూ అనేక కార్యకలాపాలు నిర్వహించినట్లు మంత్రి సమాధానం ఇచ్చారు.

ఇదీ చదవండి

Video Viral: 'పెద్దాయననే విమర్శిస్తావా?'.. సొంత పార్టీ కార్యకర్తపై వైకాపా శ్రేణుల దాడి!

Last Updated : Dec 20, 2021, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.