ETV Bharat / city

'రెండు నెలల తర్వాతే డయాఫ్రం వాల్‌పై నిర్ణయం'..దిల్లీ సమావేశంలో నిర్ణయం

Deportment of Water Energy Meeting on Polavaram: కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టుపై దిల్లీలో కీలక సమావేశం జరిగింది. వరద ప్రవాహానికి దెబ్బతిన్న పోలవరం డయాఫ్రం వాల్‌ నిర్మాణంపై మరో రెండు నెలల తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. డయాఫ్రం వాల్‌ సామర్థ్యం ఎలా ఉందో తేల్చిన తర్వాతే పూర్తిగా కొత్తది నిర్మించాలా.. లేక పాక్షిక నిర్మాణామా అనే విషయంపై స్పష్టత రానుంది. ఈ నెల 22వ తేదీన నిపుణల బృందం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది.

జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టుపై కీలక సమావేశం

author img

By

Published : May 18, 2022, 4:52 AM IST

Updated : May 18, 2022, 6:20 AM IST

'రెండు నెలల తర్వాతే డయాఫ్రం వాల్‌పై నిర్ణయం'

Union Ministry of Water Energy Meeting on Polavaram: కేంద్ర జలశక్తి శాఖ ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన పోలవరం సమస్యల పరిష్కారంపై దిల్లీలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట గోదావరి గర్భంలో ఇసుక కోత, పెద్ద పెద్ద గోతులను పూడ్చేందుకు నిపుణులు మూడు ప్రత్యామ్నాయాలు ముందుంచారు. నీటిని తోడేయడం, ఆ తర్వాత ఇసుకను నింపడం మొదటిది కాగా.. డ్రెడ్జింగ్‌ విధానంలో ఇసుక నింపడం రెండోది. కొంత డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుక నింపుతూ, వైబ్రో కాంపాక్షన్‌తో ఇసుక గట్టిదనాన్ని పెంచి ఆ తర్వాత సాధారణ స్థాయికి తీసుకురావడం మూడోది. ఇందులో మూడో ప్రత్యామ్నాయానికి నిపుణులు మొగ్గు చూపారు. దీనిపై పలు పరీక్షలు చేసి, జులై 15కి ఫలితాలు వచ్చాక కేంద్ర జలసంఘానికి, డ్యాం రివ్యూ ప్యానల్‌ సభ్యులకు పంపాలని నిర్ణయించారు.

ఆ తర్వాత దీనికి సంబంధించి ఆగస్టు 15లోగా డిజెన్ల ప్రతిపాదనలు, ఎలా ముందుకెళ్లాలో సమగ్రంగా నివేదికలు తయారు చేయాలని నిర్ణయించారు. వాటిని కేంద్ర జలసంఘానికి, డీడీఆర్​పీ(DDRP)కి పంపి వాటి ఆమోదం పొందిన తర్వాత అక్టోబర్‌ నుంచి ప్రారంభించాలని తీర్మానించారు. జులై ప్రారంభంలోగా వరదలు వచ్చే సమయానికి దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు పూర్తిచేయాలని నిశ్చయించారు. ప్రధాన డ్యాం రెండో భాగంలో ఇసుక కోత పడ్డ ప్రాంతంలో ఇసుక నింపడం, వైబ్రో కాంపాక్షన్‌తో ఇసుకను మెరుగుపరుస్తూ అక్కడి పరిస్థితులను చక్కదిద్దాలని నిర్ణయించారు. ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాంల వద్ద ఎంత సీఫేజ్‌ ఉంటుందో పరీక్షించాలని తీర్మానించారు.

ప్రస్తుతం గోదావరిలో నిర్మించిన డయాఫ్రం వాల్‌ సామర్థ్యం ఎలా ఉందో తేల్చాలని.. దీనికి రెండు నెలల గడువు ఇస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాతే మళ్లీ కొత్తగా డయాఫ్రం వాల్‌ నిర్మించడమా లేక దెబ్బతిన్నంత మేర సమాంతర డయాఫ్రం వాల్‌ నిర్మించడమా అన్నది తేల్చగలమని స్పష్టంచేశారు. వెదిరె శ్రీరాం నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ నెల 22న పోలవరం డ్యాం, నిర్మాణ ప్రదేశాలను సందర్శించనున్నట్లు భేటీ అనంతరం అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో కేంద్ర జలసంఘం అధికారులు, డీడీఆర్​పీ, ఐఐటీల నిపుణులు కూడా ఉంటారని తెలిపారు.

ఇదీ చదవండి: 'ఒంటరిగా ఉంటున్నా..పెళ్లికూతురిని చూడండి'.. మంత్రి రోజాకు వృద్ధుడి వింత విజ్ఞప్తి

Last Updated : May 18, 2022, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.