ETV Bharat / city

Central Minister Shekhawat: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న కేంద్రమంత్రి - కేంద్రమంత్రి షెకావత్

కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మార్చి 4న రాష్ట్రానికి రానున్నారు. ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

central minister shekavath to ap
central minister shekavath to ap
author img

By

Published : Feb 26, 2022, 9:43 AM IST

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మార్చి 4న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్​ఫిల్ డ్యామ్, రేడియల్ గేట్లు సహా.. పనులను పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

polavaram: పోలవరం ప్రాజెక్టులో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో రూ.1,383 కోట్ల మేర బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించింది. గతంలో విభాగాల వారీగా పరిమితులు పెట్టి, అంతకన్నా మించి ఖర్చు చేసిన రూ.831.93 కోట్ల పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించబోమని తేల్చిచెప్పింది. ఇప్పుడు వాటికి అదనంగా ఇతర కారణాలను చూపుతూ మరో రూ.551.37 కోట్ల బిల్లులను తిరస్కరించింది. స్పిల్‌వే, విద్యుత్కేంద్రం, ప్రధాన రాతి, మట్టి కట్టడాల నిర్మాణానికి అదనపు ధరల పేరుతో పెట్టిన బిల్లులను ఇవ్వబోమంది. ‘‘మేం 2013-14 ధరలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నాం. అందువల్ల కొత్త ఒప్పందం ప్రకారం సమర్పిస్తున్న వాటిని చెల్లించబోం’ అంటూ అథారిటీ వాటిని వెనక్కి పంపింది.

* కొత్త ఒప్పందం ప్రకారం ఖర్చు చేసిన మొత్తంలో వివిధ పనుల కింద జలవనరుల శాఖ పంపిన బిల్లులను ఇటీవల పోలవరం అథారిటీ తిరస్కరించింది. ఈమేరకు రూ.324.84 కోట్ల బిల్లులను వెనక్కి పంపింది. వాటిలో ఒప్పందాన్ని దాటి ఉన్నాయని
రూ.137.47 కోట్లు, అదనపు ధరల రూపంలో ఉన్నాయని రూ.94.66 కోట్లు, తాజా ఒప్పందానికి అనుగుణంగా ఉన్నాయని డీ వాటరింగ్‌ (నీటిని ఎత్తిపోసినందుకు) పేరిట సమర్పించిన రూ.95.71 కోట్ల బిల్లులపై అభ్యంతరాలు వ్యక్తంచేసింది.
* పోలవరం విద్యుత్కేంద్రం నిర్మాణానికి డిసెంబరు వరకు చేసిన ఖర్చులకు సంబంధించిన రూ.133.97 కోట్ల బిల్లులను తిరస్కరించింది. విద్యుత్కేంద్రం కోసం నిధులు ఇవ్వబోమని ఇప్పటికే కేంద్రం స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్కేంద్రం నిధులు అడగబోవడం లేదు. అయితే అక్కడ జరిగే మట్టి తవ్వకం పనులకు నిధులు ఇవ్వాలని, అది విద్యుత్కేంద్రం కాంపొనెంట్‌ కిందికి రాదని వాదిస్తోంది. ఇందుకు పోలవరం అథారిటీ ససేమిరా అంటోంది.
* కుడి కాలువలో తాత్కాలిక నిర్మాణాల కోసం చేసిన రూ.71.37 కోట్ల ఖర్చును ఇచ్చేందుకూ ఒప్పుకోవడం లేదు. అవి పట్టిసీమ నీటిని వినియోగించుకునేందుకు తాత్కాలికంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించిన బిల్లులని తేల్చింది.

ఇదీ చదవండి:

CBN On Political Journey: సాధించాలనే తపన తగ్గలేదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.