ETV Bharat / city

సీరియస్‌గా ఆరా తీస్తున్న కేంద్రం.. అప్పుల గుట్టు రట్టయ్యేనా! - Center govt on AP Debts

Central govt on AP Debts: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్రం సీరియస్‌గా ఆరా తీస్తోంది. భవిష్యత్‌ ఆదాయం తాకట్టుపెట్టి తెచ్చిన అప్పులు, కార్పొరేషన్లకు గ్యారెంటీ ఇచ్చిన తీసుకున్న రుణాలపై.... వివరాలు కోరింది. కేంద్రం అడిగిన వివరాలపై రెండ్రోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది.

Central govt on AP Debts
Central govt on AP Debts
author img

By

Published : Apr 27, 2022, 4:54 AM IST

Updated : Apr 27, 2022, 5:52 AM IST

సీరియస్‌గా ఆరా తీస్తున్న కేంద్రం.. అప్పుల గుట్టు రట్టయ్యేనా!

అప్పులు పుట్టించేందుకు ఆంధ్రప్రదేశ్‌ అనుసరించిన కొత్తకొత్త మార్గాలపై కేంద్ర ఆర్థికశాఖ సీరియస్‌గా దృష్టి సారించింది. బడ్జెట్‌లో చూపించకుండా.. రకరకాలుగా కొత్త చట్టాలు చేస్తూ.. కొత్త మార్గాలు సృష్టిస్తూ తీసుకువచ్చిన రుణాలపైనా ఆరా తీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పుల భారం ఎంతో ముందు తేల్చి చెప్పండి- ఆ తర్వాతే మళ్లీ అప్పు చేసేందుకు అనుమతి ఇస్తామని కుండబద్దలు కొట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఇలా సమాచారం కోరినా- వారు రూపొందించిన ఫార్మాట్లు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ఎన్ని మార్గాల్లో రుణాలు సమకూర్చుకుందో వాటన్నింటినీ ప్రస్తావిస్తూ ఆయా విభాగాల కింద ఎంత అప్పు పుట్టించారో చెప్పాలని కేంద్రం కోరింది. గత ఏడాది కూడా ఇలాంటి వివరాలు కోరినా అప్పటికీ, ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఆదాయాలను తాకట్టు పెట్టి, అదనపు ఎక్సైజ్‌ రిటైల్‌ ట్యాక్సు వంటివి ఎస్క్రో చేసి.. ఇంకా అనేక మార్గాల్లో రుణాలు తీసుకోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు కేంద్రం నిర్దేశించిన ఫార్మాట్లలో అప్పుల సమగ్ర సమాచారం వెల్లడించాలని కోరడంతో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను టార్గెట్‌ చేసుకున్నట్లు కనిపిస్తోందని ఇతర రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. దాదాపు మూడు వారాలకు పైగా దీనిపై కసరత్తు సాగించిన రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు రెండ్రోజుల కిందటే సమాచారం పంపించారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలు కొన్ని ఆయా ఫార్మాట్ల ప్రకారం సమాచారం ముందే పంపినా.. వారికి కూడా కొత్త అప్పు తీసుకునేందుకు ఇంకా అనుమతులు లభించలేదు. కేంద్ర ఆర్థికశాఖ అధికారులు అందులోని కొన్ని రాష్ట్రాలతో ఇప్పటికే చర్చలు సాగిస్తున్నట్లు తెలిసింది. పైగా మరికొంత సమాచారమూ కోరుతున్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏపీ చేసిన అప్పులు ఇంతా అంతా కాదు.. వీటన్నింటినీ లోతుగా పరిశీలిస్తే తప్ప రుణాలు పుట్టే అవకాశం కనిపించడం లేదు. ఇంతవరకు కేంద్రం కేవలం పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు మాత్రమే బహిరంగ మార్కెట్‌ రుణాలకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ అప్పులకు సంబంధించి సమగ్ర సమాచారం సమర్పిస్తే, కేంద్రం రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఇదే తరహా సీరియస్‌గా దృష్టి సారిస్తే ఏపీకి కొత్త అప్పులు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎంపీ రుఘురామకృష్ణరాజు ఫిర్యాదులు: కొత్త అప్పులకు అనుమతి ఇచ్చేముందు ఏటా కేంద్రం అంతకుముందు సంవత్సరం రుణాల వివరాలు కోరడం సహజం. ఆంధ్రప్రదేశ్‌ భిన్న రూపాల్లో చేసిన అప్పులపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానికి, కేంద్ర ఆర్థికశాఖకు పదే పదే ఫిర్యాదులు చేశారు. కేంద్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులనూ కలిసి వివరించారు. దీంతో కేంద్ర అధికారులు లోతుల్లోకి వెళ్లి పరిశీలించి అన్ని రకాల అప్పులపైనా సమాచారం తెలియజేయాలని రాష్ట్రాలకు లేఖలు రాశారు. ఇందులో ప్రధానంగా ఏపీ చేస్తున్న అప్పుల తీరే కీలకాంశం కాబోతోందని సమాచారం. ప్రధానంగా బడ్జెట్‌లో చూపని రుణాల ప్రమాదంపై కేంద్ర ఆర్థికశాఖ సీరియస్‌గా ఉంది.

ఎలాంటి ఆదాయం లేని కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకోవడం, వాటి అసలు, వడ్డీ ప్రభుత్వమే తన బడ్జెట్‌ నుంచి చెల్లిస్తున్న అంశంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ అంశాలు ఆర్టికల్‌ 293కి వ్యతిరేకంగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు నిధులు రాకుండా కోత పెట్టి అసలు ఆదాయ మార్గాన్ని మూసివేసి.. అది అప్పులు తెచ్చుకునేందుకు మళ్లించే అంశంపైనా సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. పైగా అదనపు ఎక్సైజ్‌ రిటైల్‌ సుంకం వంటివి విధించి ఆ మొత్తాన్ని అప్పుల కోసం ఎస్క్రో చేసిన విధానమూ తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఏపీయే ఇన్ని రకాలుగా అప్పులు చేసింది. రాష్ట్రం ఈ అప్పుల వివరాలు ఎంత సమగ్రంగా పంపుతుందీ, కేంద్రం ఎంత నిశితంగా వాటిని పరిశీలించనుందీ అనే అంశాల ఆధారంగా రాష్ట్ర నికర రుణ పరిమితి తేలనున్నది.

కేంద్రం లేఖలో ముఖ్యాంశాలు:

* 2022-23 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర జీఎస్‌డీపీ అంచనాల్లో 3.5 శాతం నికర రుణ పరిమితిగా 15వ ఆర్థిక సంఘం తేల్చింది. ఆ మేరకు రుణ అనుమతి ఇస్తాం. ఒకవేళ పాత సంవత్సరాల్లో అంతకుమించి రుణం తీసుకుని ఉంటే ప్రస్తుత సంవత్సరంలో ఆ మేరకు రుణ అర్హతను తగ్గిస్తాం. ఒక వేళ ఏ సంవత్సరమైనా పరిమితికి తక్కువగా రుణం తీసుకుని ఉంటే ఆ తర్వాతి సంవత్సరంలో ఆ మేరకు పెంచుతాం.

* విద్యుత్తు రంగంలో సంస్కరణల అమలు తీరును బట్టి మరో 0.50 (జీఎస్‌డీపీ అంచనాల్లో) శాతం మేర రుణాలకు అనుమతిస్తాం.

* నికర రుణ పరిమితి తేల్చేముందు బహిరంగ మార్కెట్‌ రుణం, కేంద్ర రుణాలు, విదేశీ సంస్థల నుంచి తెచ్చిన రుణాలు, ప్రజాపద్దు వల్ల, చిన్న మొత్తాల పొదుపు రూపంలో ప్రభుత్వం వాడుకునే మొత్తాలు, పీఎఫ్‌, రిజర్వు నిధులు, డిపాజిట్లు తదితరాలన్నీ లెక్కిస్తాం.

* జీఎస్డీపీ అంచనాల్లో 3.5 శాతం మేర సాధారణంగా నికర రుణ పరిమితిగా లెక్కిస్తాం. జాతీయ పెన్షన్‌ పథకానికి సంబంధించిన చెల్లింపులు, భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వ భారాలు ఏవీ ద్రవ్యలోటులో సరిగా ప్రతిబింబించడం లేదు. పెన్షన్‌ పథకానికి ఉద్యోగులు, ప్రభుత్వ వాటా కింద చెల్లించే అసలు మొత్తానికి అనుగుణంగా అదనపు రుణ పరిమితిని కల్పిస్తాం.

* బడ్జెట్‌ గణాంకాల్లో చూపకుండా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు చేసే రుణాలు, ప్రత్యేక ప్రయోజనం కోసం (ఎస్‌పీవీ) తీసుకున్నవీ పరిగణనలోకి తీసుకుంటాం. రాష్ట్ర బడ్జెట్‌ నుంచి వాటి అసలు, వడ్డీలు చెల్లిస్తుంటే ఆ వివరాలు నికర రుణ పరిమితి నిర్ణయంలో పరిగణనలోకి తీసుకుంటాం.

* రాష్ట్రం పన్నులు లేదా సెస్‌లు విధించి ఆ రూపంలో లేదా రాష్ట్రానికి వచ్చే ఏ రెవెన్యూ అయినా అప్పులు తీర్చేందుకు ప్రత్యేకంగా ఉద్దేశించి రుణం తీసుకుంటే ఆ మొత్తాల వివరాలు తెలియజేయాలి. ఒకవేళ ఇలా 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఈ రూపాల్లో అప్పులు చేస్తే అవి కూడా నికర రుణ పరిమితి నుంచి మినహాయిస్తాం. (ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఐడీసీ నుంచి తీసుకువచ్చిన రుణాలు, బేవరేజస్‌ కార్పొరేషన్‌ నుంచి తీసుకున్న రుణాలు, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి తెచ్చిన రుణాల లెక్కలన్నీ కేంద్రానికి రాష్ట్రం సమర్పించాల్సి ఉంటుంది. ఎంతవరకు సమర్పించారన్నది చూడాలి).

* విద్యుత్తు బకాయిలు ఏమైనా సకాలంలో చెల్లించకపోతే ఆ మేరకు ఆ మొత్తాన్ని నికర రుణ పరిమితి నుంచి మినహాయిస్తాం. (గతంలో ఏపీ కూడా విద్యుత్తు బకాయిలు చెల్లించని అంశంలో పరిణామాలు తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే.)

* 2021-22 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయంతో దాదాపు రూ.5,309 కోట్ల రుణానికి లింకు పెట్టింది. ఆ తర్వాత ఈ మొత్తానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 2022 జూన్‌లో పాత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం లెక్కలు పరిశీలించనుంది. ఒక వేళ పరిమితి మేరకు మూలధన వ్యయం చేయకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ రూపేణా మళ్లీ కోత పెడతాం.

* రాష్ట్ర ప్రభుత్వం 2021-22లో లేదా అంతకుముందు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించి ఎలాంటి అప్పు తీసుకున్నా ఆ మొత్తం ప్రస్తుత ఏడాది నికర రుణ పరిమితి నుంచి కోత పెడతాం.

Last Updated : Apr 27, 2022, 5:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.