ETV Bharat / city

తెలంగాణ: 'రూపాయి కిలోబియ్యం పథకానికి కేంద్రమే రూ.30 ఇస్తోంది' - తెలంగాణ రాజకీయ వార్తలు

రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేయని వారికి.. హైదరాబాద్​ గ్రేటర్​ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కులేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. రూపాయికి కిలో బియ్యం పథకానికి.. కేంద్రం కేజీకి రూ.30 ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు రూపాయలు మాత్రమే ఇస్తోందని కిషన్​రెడ్డి పేర్కొన్నారు.

ghmc election campaign
ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న కిషన్​ రెడ్డి
author img

By

Published : Nov 22, 2020, 9:10 PM IST

గత ఐదేళ్లలో కేసీఆర్​ సర్కారు ఎన్ని రెండు పడక గదుల ఇళ్లు కట్టారని.. ఎన్ని పంపిణీ చేశారని ప్రభుత్వాన్ని కిషన్​ రెడ్డి ప్రశ్నించారు. ఇళ్లు ఇవ్వకపోతే తెరాస పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కులేదన్నారు. ఎవరింటికైనా తెరాస నేతలు వస్తే రెండు పడక గదుల ఇళ్ల పంపిణీపై నిలదీయాలని ప్రజలకు సూచించారు. వరద సాయం పదివేల రూపాయిలు ఎంతమందికి ఇచ్చారని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. పేద ప్రజలకు అందాల్సిన డబ్బును అధికార పార్టీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. భాజపా అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కిషన్​రెడ్డి అభ్యర్థించారు.

కేసీఆర్​ మాటలు కోటలు దాటుతాయి తప్ప.. పనులు మాత్రం జరగవు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తోంది. ప్రతీ ఇంటికి వంట గ్యాస్​ రాయితీని అందిస్తోంది. రూపాయికే కిలోబియ్యం పథకానికి కేజీకి రూ.30 కేంద్రం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు రూపాయిలు మాత్రమే ఇస్తోంది. సచివాలయం లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే.

- కిషన్​రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న కిషన్​ రెడ్డి

ఇవీచూడండి: 'వడ్డీంపులు, వాయింపులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.