ETV Bharat / city

AP govt financial fraud: రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలు

author img

By

Published : Mar 20, 2022, 5:48 AM IST

AP govt financial fraud:వైకాపా ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు కేంద్రం పేర్కొంది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా కాగ్‌ నిర్ధారించిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 'వైఎస్‌ఆర్‌ గృహవసతి' ఖర్చును మూలధన వ్యయం కింద తప్పుగా చూపించారని పేర్కొంది. 2020 మార్చితో ముగిసిన ఏడాదికి సంబంధించి కాగ్ నివేదిక వెల్లడించింది.

AP govt financial fraud
AP govt financial fraud

AP govt financial fraud:ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న బడ్జెట్‌, ఇతర నిధుల వ్యయంపై కేంద్ర ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. ఒక పద్దులో ఖర్చు చేసిన నిధులను ఇంకో విభాగంలో చూపారని, మరోచోట అసలు ఖర్చే చేయని నిధులను వ్యయపరిచినట్లు చూపారని ఆక్షేపించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వైఎస్‌ఆర్‌ గృహవసతి కింద ఖర్చు చేసిన రూ.3,371.60 కోట్లను మూలధన వ్యయం కింద తప్పుగా చూపారంది. అలాగే ఎస్‌డీఆర్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద అందిన నిధులను విపత్తు సహాయ పునరావాసం (డిజాస్టర్‌ రిలీఫ్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌) కింద ఖర్చు చేయకపోయినా చేసినట్లు చెబుతూ ఆ నిధులను ద్రవ్య వినిమయ చట్టానికి విరుద్ధంగా వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాలకు మళ్లించినట్లు తెలిపింది. దీన్నిబట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వ వ్యయ లెక్కల కచ్చితత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌చౌదరి... తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం అంశంపై ఫిబ్రవరి 7న లోక్‌సభ జీరో అవర్‌లో రామ్మోహన్‌నాయుడు ప్రస్తావించిన అంశాలకు సమాధానంగా పంకజ్‌చౌదరి తాజాగా లేఖ రాశారు.

‘2020 మార్చితో ముగిసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్‌ సమర్పించిన నివేదిక ప్రకారం.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వైఎస్‌ఆర్‌ గృహవసతి పథకం కింద రూ.3,371.60 కోట్లను మూలధన వ్యయంగా ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా చూపింది. 2019-20 సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అందించాలని ప్రణాళిక రూపొందించి, ఇంటి స్థలాలను లబ్ధిదారుల కుటుంబాల్లోని మహిళల పేరుపై రిజిస్టర్‌ చేయాలని నిర్ణయించింది. భూమి, ఇళ్లు లబ్ధిదారుల పేరుమీద రిజిస్టర్‌ అయినప్పుడు అది లబ్ధిదారుల వ్యక్తిగత ఆస్తి అవుతుంది తప్ప ప్రభుత్వ ఆస్తి కాదు. అందువల్ల దానిపై చేసిన ఖర్చును రెవెన్యూ వ్యయం కింద చూపాలి. దీనికితోడు చిన్నచిన్న పనుల కోసం చేసిన రూ.1,007.74 కోట్ల ఖర్చు కూడా ఆస్తులను సృష్టించేలా లేదు. అయినా దాన్ని కూడా మూలధన వ్యయం కింద చూపారు.

ప్రకృతి వైపరీత్య నిధుల మళ్లింపు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురించి మీకు మరో విషయం చెప్పదలచుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో కేంద్ర వాటా కింద రూ.324.15 కోట్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లో రూ.570.91 కోట్లు అందాయి. కాగ్‌ నివేదిక ప్రకారం ఖరీఫ్‌లో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1,110 కోట్ల మొత్తాన్ని అగ్రికల్చర్‌ డైరెక్టరేట్‌కు చెందిన డిపాజిట్‌ ఖాతాకు బదిలీ చేశారు. వాటినే 2020 మార్చి 31న మళ్లీ వ్యవసాయ శాఖ కమిషనర్‌ వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాకు మళ్లించారు. ఈ మొత్తాన్ని ప్రకృతి వైపరీత్య సహాయ, పునరావాసం కోసం వ్యయపరిచినట్లు చెప్పిన ప్రభుత్వం.. ద్రవ్య వినిమయ చట్టానికి వ్యతిరేకంగా కమిషనర్‌ వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాకు బదిలీ చేసినట్లు కాగ్‌ నివేదిక వెల్లడించింది. పీడీ ఖాతాకు బదిలీ చేసిన మొత్తం వ్యయం అంతా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి సర్దుబాటు చేసిందే. అయితే దాన్ని ఖర్చు చేసినట్లుగా చూపారు. 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నిధులను మహమ్మారి సంబంధ వ్యయం కింద చూపి, తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఉపయోగించింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారం వైపరీత్య నిధులను ఖర్చుగా చూపేటట్లయితే దాన్ని తక్షణ ఉపశమన చర్యలకు మాత్రమే ఉపయోగించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను పీడీ అకౌంట్లకు బదిలీ చేసింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని పంకజ్‌చౌదరి తన లేఖలో వివరించారు.

రైల్వే డివిజన్ల పరిధి.. జిల్లాలు, రాష్ట్రాల వారీగా ఉండదు: రైల్వే డివిజన్ల పరిధి రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఉండదని రైల్వే శాఖ సహాయ మంత్రి రావ్‌సాహెబ్‌ పాటిల్‌ దాన్వే స్పష్టం చేశారు. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు, పలాస, మందసరోడ్డు, సుమ్మాదేవి, బారువ, ఝాడుపూడి, ఇచ్ఛాపురం, సోంపేట రైల్వే డివిజన్లను దక్షిణ కోస్తా రైల్వేజోన్‌లో విలీనం చేసే అంశంపై డిసెంబరు 9న లోక్‌సభ జీరో అవర్‌లో రామ్మోహన్‌నాయుడు చేసిన ప్రస్తావనకు స్పందనగా ఆయన తాజాగా లేఖ రాశారు. ‘విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌ ఏర్పాటుకు ఇప్పటికే నిర్ణయం జరిగింది. ప్రస్తుతం ప్రణాళిక, సన్నద్ధత కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే డివిజన్‌, జోన్ల పరిధి ప్రాంతాలవారీగా కాకుండా రైళ్ల రాకపోకలకు అనువుగా ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొనే తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల సరిహద్దులను నిర్ణయించనున్నాం. అలాగే రైల్వే భౌగోళిక పరిధిని దృష్టిలో పెట్టుకొనే రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాలు, జోన్లు, ప్రాంతాలవారీగా కాదు. విశాఖపట్నం అవసరాలను అటు భువనేశ్వర్‌, ఇటు సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌బీలు తీరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం కేంద్రంగా కొత్త ఆర్‌ఆర్‌బీ ఏర్పాటు చేయక్కర్లేదు’ అని వివరించారు.

ఇదీ చదవండి : అక్కడ కోర్టు ఏర్పాటు జాప్యంపై హైకోర్టు అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.