ETV Bharat / city

శ్రీకాకుళం అధికారుల మెనూ అనుసరించండి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ - విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

విద్యార్థులకు పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజనంలో పోషకాలు అధికంగా ఉండే తృణధాన్యాలను వినియోగించాలని... కేంద్ర మానవవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. తృణధాన్యాల ఆధారిత మధ్యాహ్న భోజనం తిన్న పిల్లల్లో 50% అధికవృద్ధి ఉన్నట్లు. ఇక్రిశాట్ అధ్యయనంలో తేలిందని... మానవవనరుల శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్​సీ మీనా తెలిపారు.

Center government sends letter to states over  lunch for students
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
author img

By

Published : Feb 21, 2020, 8:28 AM IST

Center government sends letter to states over  lunch for students
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

విద్యార్థులకు పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజనంలో పోషకాలు అధికంగా ఉండే తృణధాన్యాలను వినియోగించాలని కేంద్ర మానవవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్​సీ మీనా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. వీటిని వినియోగించడం వల్ల విద్యార్థులకు సూక్ష్మ పోషకాలతో పాటు బి-కాంప్లెక్స్ అంది వారికి బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. అందుబాటులో ఉండే జొన్నలు, సజ్జలు, రాగులు, పిండి రూపంలో పిల్లలకు అందిచాలన్నారు. కర్ణాటకలో అక్షయపాత్ర ఫౌండేషన్ సరఫరా చేసిన తృణధాన్యాల ఆధారిత మధ్యాహ్న భోజనం తిన్న పిల్లల్లో 50% అధికవృద్ధి ఉన్నట్లు ఇక్రిశాట్ అధ్యయనంలో తేలిందని లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐసీడీఎస్ కింద 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు వారానికి నాలుగు రోజులు చిరుధాన్యాలతో కూడిన భోజనం అందిస్తున్న విషయాన్ని ఆర్​సీ మీనా గుర్తుచేశారు. దీనివల్ల ఆ పిల్లల్లో 42% ప్రోటీన్లు, 2.6 రేట్ల క్యాల్షియం, 5 రేట్లు ఇనుము, 59%జింక్ పెరిగినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రమాద మృతుల కుటుంబాలకు కమల్​ ఆర్థిక సాయం

For All Latest Updates

TAGGED:

millets
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.