పీపీఏల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి తప్పుబట్టారు. కేంద్ర చివాట్లు, కోర్టులు మెుట్టికాయలు పెట్టినా.. వైకాపా వాళ్లు పెడచెవిన పెట్టారంటూ విమర్శించారు. తాజాగా పీపీఏల రద్దుపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై.. చంద్రబాబు స్పందించారు. మూడు కంపెనీలకు తెదేపా ప్రభుత్వం దోచిపెట్టిందన్న వైకాపా నేతల ఆరోపణలన్నీ అవాస్తవాలేనని రుజువులతో సహా ఆ లేఖలో తెలిపారని పేర్కొన్నారు. జీవో 63ని హైకోర్టు కొట్టివేయటం ఒక చెంపపెట్టు అయితే... కేంద్రమంత్రి లేఖ మరో చెంపపెట్టు అని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: