ETV Bharat / city

CBI COURT NOTICES: బెయిల్ రద్దు పిటిషన్‌లో విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు - విజయసాయి రెడ్డి బెయిల్​ రద్దు పిటిషన్​ తాజా వార్తలు

vijayasai reddy bail cancel petition
vijayasai reddy bail cancel petition
author img

By

Published : Aug 7, 2021, 2:33 PM IST

Updated : Aug 7, 2021, 3:19 PM IST

14:31 August 07

బెయిల్ రద్దు పిటిషన్‌లో విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు

 బెయిల్ రద్దు పిటిషన్‌లో విజయసాయిరెడ్డికి హైదరాబాద్​ సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐను న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 10న విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనుంది. 

 జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టును కోరారు. ఎంపీగా కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచుగా కలిసే విజయసాయిరెడ్డి.. తనకు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయనే విధంగా చిత్రీకరించి సాక్షుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భయం కలిగిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి ఎంపీ కాగానే .. జగన్‌ అక్రమాస్తుల కేసుల ప్రధాన దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అధికారిని సీబీఐ జేడీ చేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, ఇది స్వేచ్ఛాయుత విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించారు.

RRR Petition: విజయసాయి బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురామ వ్యాజ్యం

Last Updated : Aug 7, 2021, 3:19 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.