ETV Bharat / city

CAT MISSING: 'క్యాట్ మిస్సైంది.. దయచేసి​ ఆచూకీ చెప్పండి' - telangana varthalu

అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లి కనిపించడం లేదని ఓ జంతు ప్రేమికురాలు ఫిర్యాదు చేశారు. దాదాపు నెల రోజులుగా గాలించినా ఆచూకీ లభించలేదని ఆమె వాపోయారు. ఆచూకీ చెప్తే ఏకంగా రూ.30 వేల రివార్డు అందజేస్తామని హైదరాబాద్​కు చెందిన జంతు ప్రేమికురాలు సెరీనా ప్రకటించారు.

జంతు ప్రేమికురాలు
జంతు ప్రేమికురాలు
author img

By

Published : Jul 29, 2021, 8:00 PM IST

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ పిల్లి కనిపించకుండా పోయిందని హైదరాబాద్​కు జంతు ప్రేమికురాలు సెరీనా ఆవేదన వ్యక్తం చేశారు. పెట్ క్లినిక్ ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని డిమాండ్ కోరారు. చనిపోయిన పిల్లిని చూపించి ఆసుపత్రి సిబ్బంది తనను మోసం చేస్తున్నారని వాపోయారు. తన పిల్లి ఆచూకీ తెలిపిన వారికి రూ. 30 వేలు నజరానా అందజేస్తామంటూ ప్రకటించారు.

టోలిచౌకి ప్రాంతానికి చెందిన సెరీనా జంతు ప్రేమికురాలు. చిన్నతనం నుంచి తన ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుతోంది. గత ఎనిమిది నెలల క్రితం అప్పుడే పుట్టిన పిల్లికి జింజర్​ అని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటోంది. కరోనా నేపథ్యంలో పిల్లికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేందుకు జూన్ 17 న జూబ్లీహిల్స్​లోని (ట్రస్టీ) పెట్ క్లినిక్​కు తీసుకువచ్చి సర్జరీ చేయించింది. స్టిచెస్ వేసిన చోట స్వెల్లింగ్ రావడంతో తిరిగి జూన్ 23న అదే ఆసుపత్రికి తీసుకెళ్లింది. చికిత్స జరుగుతుండగా జూన్ 24న ఆసుపత్రి నుంచి పిల్లి తప్పిపోయిందంటూ సిబ్బంది సెరీనాకు చెప్పడంతో ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదిసింది.

ఈ విషయంపై జూన్ 27న రాయదుర్గం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో, తానే స్వయంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో కరపత్రాలు పంచుతూ జింజర్​ ఎవరికైనా కనిపిస్తే తనకు అప్పగించాలని కోరింది. దాదాపు నెల రోజుల నుంచి జింజర్​ గురించి వెతుకుతోంది.

ఆచూకీ ఇంకా దొరకలే..

ఆస్పత్రి సిబ్బందిని నిలదీయగా... వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై జూన్ 27న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. నేనే స్వయంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో కరపత్రాలు పంచుతున్నాను. అయినా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. -సెరీనా, జంతు ప్రేమికురాలు

ఇదీ చదవండి:

International Tigers Day: భారత్​లో పులులు సురక్షితమేనా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.