తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కారు ప్రమాదం జరిగింది. బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద కారులో (Car fire at toll plaza) అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రేనాల్ట్ లార్జ్ కారు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. టోల్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలు ఆర్పినట్లు టోల్ ప్లాజా (Car fire at toll plaza) మేనేజర్ సుధీర్ తెలిపారు. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరు బయటికి వచ్చేశారు. వారికి ఏమీ కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు