అన్యాయంగా అరెస్టు చేసిన రాజధాని రైతుల్ని తక్షణమే విడుదల చేయాలని... రాజకీయ ఐకాస డిమాండ్ చేసింది. గుంటూరు జైల్లో ఉన్న రైతులను మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, రాజకీయ ఐకాస నేతలు పరామర్శించారు. అరెస్టు చేసిన రైతుల్ని తక్షణమే విడుదల చేయాలని జైలు వద్ద ఆందోళన చేశారు. రాజధాని కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే అరెస్టు చేయడం దారుణమని నేతలు మండిపడ్డారు.
ఇదీ చదవండి