హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని అమరావతి రైతులు కలిశారు. రాజధాని రైతులకు అన్యాయం చేయకుండా చూడాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్ కోసం భూములిచ్చిన తమని.. పెయిడ్ ఆర్టిస్టులుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములివ్వటం తాము చేసిన తప్పా ..? అని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి...రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమైనప్పటికీ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రైతులకు సర్ది చెప్పి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయంతో వస్తే.. కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు.
ఇదీ చదవండి : రేపు జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ ఎల్లుండికి వాయిదా