ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలు 111వ రోజూ కొనసాగాయి. తుళ్లూరు మండలం పెదపరిమి, మందడం, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల్లో రైతులు, మహిళలు సామాజిక దూరం పాటిస్తూ ధర్నాలో పాల్గొన్నారు. 3 ముక్కల రాజధాని వద్దంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అమరావతి తరలింపుపై పునరాలోచన చేయాలన్నారు.
ఇవీ చదవండి: