రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ (రెస్కో) స్వాధీనం ఆదేశాలు రద్దు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీపై ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. అమ్మకం, పంపిణీ, లైసెన్స్ కారణాలతో ఏకపక్ష చర్య సరికాదన్న చంద్రబాబు.. రెస్కోకు లక్షా 24 వేల గృహ, వాణిజ్య, పారిశ్రామిక, సాగు కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. రెస్కోను ఎస్‌పీడీసీఎల్‌లో విలీనం చేయడం అర్థం లేని పని అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈఆర్‌సీ తీసుకున్న నిర్ణయం నిరాశకు గురిచేసిందని తెదేపా అధినేత వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండీ... రాష్ట్రాలకు దన్ను: 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు