ETV Bharat / city

తెలంగాణ: మినీ పురపోరులో ప్రచార సమయం కుదింపు - Telangana curfew news

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మినీపురపోరు సమయాన్ని కుదించారు. కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రచార సమయాల్లో మార్పులు చేశారు.

campaign timing for municipal elections
మినీ పురపోరులో ప్రచార సమయం
author img

By

Published : Apr 20, 2021, 9:30 PM IST

కొవిడ్ విజృంభణ నేపథ్యంలో మినీ పురపోరులో ప్రచార సమయాన్ని కుదించారు. వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. అందుకు అనుగుణంగా పురపోరు ప్రచార సమయాల్లోనూ మార్పులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

బహిరంగసభలు, ర్యాలీల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం ఇప్పటివరకు రాత్రి పది గంటల వరకు ఉండగా ఆ సమయాన్ని రాత్రి ఎనిమిది గంటల వరకు కుదించారు. ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకే అనుమతిచ్చారు. ఇతర సందర్భాల్లో లౌడ్ స్పీకర్లను ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకే వినియోగించాల్సి ఉంటుంది.

బహిరంగసభలు, ర్యాలీలు, ప్రచారానికి కొవిడ్ నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులకు లోబడి అనుమతి ఇవ్వాలని అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

మద్యం దుకాణాల వద్ద నిబంధనలు పట్టవా..

టీకా తయారీ సంస్థల ప్రతినిధులతో ప్రధాని భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.