ETV Bharat / city

CAG ON AP: బడ్జెట్‌ అనుమతులు లేకుండా చేసిన ఖర్చు 94,399 కోట్లు

బడ్జెట్ కేటాయింపులు లేకుండానే వేలకోట్ల వ్యయం చేయడంపైనా కాగ్ అసంతృప్తి(cag not satisfaction over spending billions in ap ) వ్యక్తం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.94 వేలకోట్లకు పైగా ఖర్చుచేశారని వెల్లడించింది. అది అధీకృత ఖర్చు కాదని స్పష్టం చేసింది. 9 నెలల రాష్ట్ర బడ్జెట్​ను పరిశీలించిన కాగ్.. లోపాలను ప్రస్తావించింది.

CAG ON AP
CAG ON AP
author img

By

Published : Feb 23, 2022, 4:43 AM IST

రాష్ట్రంలో బడ్జెట్‌ అనుమతి(ప్రొవిజన్‌) లేకుండానే రూ.94,399.04 కోట్లు ఖర్చు చేశారని కాగ్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం తప్పు పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22)లో డిసెంబరు నెలాఖరుకు రాష్ట్రంలో చేసిన మొత్తం ఖర్చును విశ్లేషించిన కాగ్‌ అధికారులు అనేక అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్షియల్‌ కోడ్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు బడ్జెట్‌లో వివిధ ప్రభుత్వ విభాగాలకు రూ.వేల కోట్ల కేటాయింపులు ఉన్నా ఖర్చు చేయడం లేదని విశ్లేషించారు. ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చుల వివరాలను కాగ్‌కు అధికారులు సమర్పిస్తుంటారు. వాటిని అకౌంటెంట్‌ విభాగ అధికారులు పరిశీలించి... బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఎంత కేటాయింపులు జరిపారు? ఎంత ఖర్చు చేశారు? రెవెన్యూ లోటు ఉందా? మిగులు ఉందా? ద్రవ్యలోటు ఉందా? వంటి అంశాలపై నివేదికలు ఇస్తారు.

ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలల్లో ఏపీ ప్రభుత్వ ఖర్చులను పరిశీలించిన కాగ్‌... సంబంధిత నివేదికను వెల్లడించింది. ఖర్చులు జరిగిన తీరును విశ్లేషించి అనేక లోపాలను గుర్తించింది. వాటిని ప్రస్తావిస్తూ కాగ్‌ ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలోని ఒక ఉన్నతాధికారి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి తాజాగా లేఖ రాశారు. ఈ లోపాలను సరిదిద్ది, పరిష్కార చర్యలను చేపట్టి కాగ్‌కు తిరిగి తెలియజేయాలని అందులో సూచించారు.

లేఖలో కాగ్‌ ఎత్తిచూపిన ముఖ్య లోపాలు...

* ఏదైనా ఖర్చు చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా దానికి తప్పనిసరిగా బడ్జెట్‌ ప్రొవిజన్‌ ఉండాలి. అయితే... ఎలాంటి బడ్జెట్‌ అనుమతి లేకుండానే దాదాపు 124 అంశాల్లో రూ.94,399.04 కోట్లను వివిధ ప్రభుత్వ శాఖలు ఖర్చు చేశాయి.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 947 అంశాల్లో బడ్జెట్‌లో కేటాయింపులకు మించి రూ.13,398.71 కోట్లు ఖర్చు చేశారు.

* మరోవైపు బడ్జెట్‌ కేటాయింపుల్లో రూ.30,327.26 కోట్లను వివిధ విభాగాల కింద ఖర్చు చేసేందుకు ప్రతిపాదించి... కనీసం పైసా కూడా ఖర్చు చేయలేదు. ఇలా 2,214 అంశాల్లో జరిగింది.

* రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకుంటుంది. అదే సమయంలో ప్రతినెలా గతంలో తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీల రూపంలో కొంత మొత్తం చెల్లిస్తుంది. ఈ క్రమంలో 2021 డిసెంబరులో రూ.3,250 కోట్లను మార్కెట్‌ నుంచి, రూ.81.11 కోట్లను కేంద్రం నుంచి రుణంగా తీసుకుంది. అదే నెలలో కేంద్ర రుణాలకు సంబంధించి పాత చెల్లింపులు చేసినా... బహిరంగ మార్కెట్‌ రుణాలకు చెల్లింపులు జరపలేదు.

* కొన్ని అంశాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్‌ ఖర్చు చూపించారు.

వివిధ శాఖల్లో నిబంధనల ఉల్లంఘన

చాలా ప్రభుత్వ శాఖల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ బడ్జెట్‌ను దాటి ఖర్చులు చేస్తున్నారని కాగ్‌ ప్రస్తావించింది. బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించే సమయంలోనే నిక్కచ్చిగా వ్యవహరించాలని.... అంచనా, వాస్తవ ఖర్చుల మధ్య తేడా లేకుండా చూసుకోవాలన్న ఉత్తర్వులున్నా సరిగా అమలు కావడం లేదని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ కార్యాలయం అభిప్రాయపడింది.

ఇదీ చదవండి: AP IAS officers Transfer: రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.