ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. కరోనా రెండో విడత వ్యాప్తి నివారణ చర్యలపై మంత్రుల బృందం చర్చిస్తోంది. వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో జరుగుతున్న భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, సురేశ్, కన్నబాబు సహా డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఆ అంశాలపై చర్చ..
ఆస్పత్రుల్లో పడకలు పెంపు, ఆక్సిజన్ సరఫరా అంశంపైనా మంత్రులు చర్చించనున్నారు. వైద్య నిపుణుల నియామకం, కొవిడ్ కట్టడి కోసం ఆంక్షలు ఏ మేరకు విధించాలనే అంశంపైనా సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ప్రధానోపాధ్యాయుడికి పాజిటివ్... ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు