ETV Bharat / city

AP cabinet News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ - ap withdrew Three Capitals Act by ysrcp

AP government withdrew the Three Capitals Act
మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం
author img

By

Published : Nov 22, 2021, 11:04 AM IST

Updated : Nov 22, 2021, 6:14 PM IST

11:02 November 22

మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం

మూడు రాజధానుల విషయం(ap Three Capitals Act)పై రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టాన్ని (ap govt withdrew Three Capitals Act) వెనక్కు తీసుకుంటూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి పాలన వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబధించిన మూడు రాజధానుల చట్టం రద్దు బిల్లును కేబినెట్ లో ఆమోదించారు. ఇదే విషయాన్ని ఈ ఆంశంపై విచారణ జరుగుతున్న హైకోర్టుకు కూడా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తెలియచేశారు. కేబినెట్ సమావేశంలో ఆమోదం తర్వాత చట్టం రద్దు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టినట్లు పీటీఐ కథనంలో పేర్కొంది.  

ఉద్యమం ఆగదు.. 

మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి ఐకాస తెలిపింది.  ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని చెప్పింది. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని ఐకాస నేతలు తెలిపారు. ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించినవాళ్లు క్షమాపణ చెప్పాలన్నారు. మహాపాదయాత్ర కొనసాగుతుందని... ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి..

మూడు రాజధానులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం..

Last Updated : Nov 22, 2021, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.