సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రేపటి నుంచి జరపనున్న ఇసుక వారోత్సవాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం... 1 నుంచి 6 వరకు ఆంగ్ల మాధ్యమం అమలును ఆమోదించనుంది.
ఏపీ కాలుష్య నిర్వహణ సంస్థ ఏర్పాటుకు పచ్చజెండా ఊపనుంది. పట్టణాల్లో అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం... గ్రామ న్యాయాలయాల ఏర్పాటు, సంక్షేమ నిధిపైనా చర్చించించే అవకాశం ఉంది. సింగపూర్‌తో స్టార్టప్ ఏరియా రద్దుకు ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ భూముల అమ్మకాలు, బిల్డ్ ఏపీపై మంత్రివర్గం చర్చించనుంది.