ETV Bharat / city

తెలంగాణ ఆర్టీసీ సమయపాలన కుదింపు.. రాత్రి 9 లోపే ప్రయాణాలు - అమరావతి వార్తలు

తెలంగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ నిబంధనలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సమయ పాలనను కుదిస్తూ ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి తెలిపారు.

telangana rtc timings changed according to night curfew
ఆర్టీసీ బస్సుల సమయ పాలనను కుదిం
author img

By

Published : Apr 20, 2021, 5:07 PM IST

ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల సమయ పాలనను కుదించింది. రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే బస్సులను నడుపుతామని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి తెలిపారు. సిటీ బస్సులు రాత్రి 9 గంటలలోపు ఆయా డిపోలకు చేరుకుంటాయని వెల్లడించారు. అంతరజిల్లాలకు వెళ్లాల్సిన బస్సులు మాత్రం 9లోపు వెళ్తాయని ఆయన స్పష్టం చేశారు.

రాత్రి 9 తర్వాత బయలుదేరాల్సిన బస్సుల సమయాన్ని 9 లోపు వెళ్లేలా ఆయా డిపో మేనేజర్లు సమన్వయం చేసుకుంటారన్నారు. ప్రయాణికులందరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు. మాస్కులు ధరించిన వారినే బస్సుల్లో ప్రయాణానికి అనుమతిస్తామని ఆపరేషన్స్ ఈడీ యాదగిరి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: జనసేన అధికార ప్రతినిధి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.