ETV Bharat / city

ఆ బస్సుకు గాలే డ్రైవర్! - bus moved backwards because of heavy winds

ఆ బస్సులో డ్రైవర్​ లేడు.. కానీ ఆ బస్సు 200 మీటర్లు వెనక్కి వెళ్లింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు రోడ్డు పక్కన నిలిపిన ఓ ప్రైవేటు బస్సు పరిస్థితి ఇది.

bus moved due to heavy wind
గాలికి నడిచిన బస్సు
author img

By

Published : May 17, 2020, 10:58 AM IST

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సత్తుపల్లి శివారులో ఈ గాలులకు రోడ్డు పక్కన నిలిపిన ప్రైవేటు బస్సు ఒక్కసారిగా వెనక్కి జరిగింది. దాదాపు 200 మీటర్లు వెళ్లాక.. చెట్టును ఢీకొట్టి అక్కడ ఆగిపోయింది.

బస్సు వెనక్కి వెళ్తునప్పుడు.. మధ్యలో ఎలాంటి వాహనాలు రాకపోవడం, బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. మరోవైపు కల్లూరులోని ఓ ఇంటి సమీపంలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడి.. చెట్టు మంటలకు ఆహుతైంది.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ హీరో 'అంబులెన్స్​ మ్యాన్​' కథ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.