ETV Bharat / city

తెలంగాణ: సంగారెడ్డిలో విరబూసిన 30 బ్రహ్మకమలాలు - 30-brahma kamalam flowers

హిమాలయాల్లో ఏడాదికి ఒక్కసారి విరబూసే బ్రహ్మకమలాలు... మనముండే ప్రాంతంలో పూస్తే... ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 30 పూలు అందంగా దర్శనమిస్తుంటే.. ఆ అనుభూతి చెప్పలేము. ఈ మధురమైన ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది.

bramha kamalalu in sangareddy district
సంగారెడ్డిలో విరబూసిన 30 బ్రహ్మకమలాలు
author img

By

Published : Jul 29, 2020, 6:14 PM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మల్లికార్జున నగర్​కు చెందిన భద్రయ్య అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో బ్రహ్మ కమలం మొక్క నాటారు. ప్రతి ఏడాది బ్రహ్మకమలాలు పూస్తున్నా... ఈ ఏడాది మాత్రం ఒకేసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 కమలాలు పూశాయి. శివుడికి అత్యంత ఇష్టమైన ఈ బ్రహ్మకమలాలు తమ ఇంటి ఆవరణలో విరబూయడం చాలా సంతోషంగా ఉందని భద్రయ్య తెలిపారు. తొమ్మిది సంవత్సరాల నుంచి పెంచుతున్నా... ఎప్పుడు ఇంత ఎక్కువగా పూయలేదని వెల్లడించారు. వీటిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి: ఆర్థిక అంతరాలకు అంతమెన్నడు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.