ETV Bharat / city

పెళ్లి చేసుకుందాం అన్నందుకు.. చంపేస్తానని అన్నాడు! - న్యాయం చేయాలని ఓ ప్రియురాలు నిరసన

ప్రేమించిన యువతిని ఎన్‌కౌంటర్ చేస్తానని ఓ ప్రియుడు బెదిరించాడు. పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు కాదన్నాడని ప్రియురాలు మౌనదీక్షకు దిగింది. ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టి న్యాయం చేయాలని వాపోయింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది.

boyfriend-cheat-young-woman-at-tekumatla
ప్రేమించిన యువతిని చంపేస్తానని బెదిరించిన ప్రియుడు
author img

By

Published : Sep 27, 2020, 10:52 PM IST

ప్రేమించిన యువతిని చంపేస్తానని బెదిరించిన ప్రియుడు

తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో తనకు న్యాయం చేయాలని ఓ ప్రియురాలు నిరసనకు దిగింది. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ప్రియురాలిని ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించాడో ప్రేమికుడు. ఈ నేపథ్యంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌనదీక్షకు దిగింది.

టేకుమట్లకు చెందిన కొలుగూరి కార్తీక్ ఆర్మీ జవాన్. రేగొండ మండలం జగ్గయ్యపేటకు చెందిన తమ బంధువైన ఓ యువతిని గత ఆరేళ్లుగా ప్రేమించాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆ యువతి పెళ్లి చేసుకోవాలని అడగగా ముఖం చాటేశాడు.

ఫోన్​లో సంప్రదిస్తే 'నేను ఎన్‌కౌంటర్ స్పెషలిస్టును, ఎన్‌కౌంటర్ చేస్తా. నీకు దిక్కున్న చోట చెప్పుకో' అని బెదిరిస్తున్నాడని యువతి వాపోయింది. కార్తీక్​తో తన పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని యువతి తెలిపింది. చివరకు కుటుంబ సభ్యులతో కలసి టేకుమట్ల పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ప్రియురాలు, తల్లి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:

ప్రేమ పేరుతో గ్రామ వాలంటీర్ మోసం..ఫోక్సో చట్టం కింద కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.