సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ స్థానంలో 'అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ'ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. సీఆర్డీఏకు సంబంధించిన ఆస్తులు, అప్పులు అన్నీ ఏఎంఆర్డీఏకు బదలాయింపు చేస్తూ ప్రతిపాదన చేసింది.
అమరావతి నుంచి రాజధాని తరలింపుపై రైతులు ఆందోళన చేస్తున్న తరుణంలో ప్రభుత్వం వారికి పరిహారాన్ని పెంచింది. భూ సమీకరణ విధానంలో అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకూ.. పట్టా భూములు ఇచ్చిన రైతులతో సమానమైన ప్లాట్లను ఇవ్వాలని ప్రతిపాదించారు. రాజధాని ప్రాంతంలో రైతుల కౌలును మరో ఐదేళ్లు పొడిగించాలని బిల్లులో ప్రతిపాదించారు. భూములు లేని కూలీలకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ను 5వేలకు పెంచాలని ప్రతిపాదన చేశారు.
ఇవీ చదవండి...