ETV Bharat / city

మూడు రాజధానులు ఉంటే తప్పేంటి..!? - ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు తాజా వార్తలు

రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో 'ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ- సీఆర్డీఏ రద్దు' బిల్లులను రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ- రాష్ట్ర సమగ్రాభివృద్ధి బిల్లు-2020ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రి బుగ్గన పాలన వికేంద్రీకరణ ఆవశ్యకతను సభలో వివరించారు.

buggana rajendranath reddy on assembly meetings
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
author img

By

Published : Jan 20, 2020, 2:05 PM IST

Updated : Jan 20, 2020, 3:31 PM IST

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులో మూడు రాజధానులను ప్రభుత్వం ప్రతిపాదించింది. అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో హైకోర్టు న్యాయరాజధానిని కేటాయిస్తూ.. అమరావతిలో అసెంబ్లీని కొనసాగిస్తూ ప్రతిపాదించింది. శాసనసభ, శాసనమండలి అమరావతిలో కొనసాగేలా.. రాజ్​భవన్, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు విశాఖపట్నంలో ఏర్పాటుచేసేలా.. న్యాయ సంబంధమైన సంస్థలు కొత్తగా ప్రతిపాదిస్తున్న న్యాయ రాజధాని కర్నూలుకు తరలించేలా ప్రతిపాదనలు చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థికమంత్రి బుగ్గన ప్రసంగించారు. 'అభివృద్ధి ఒకచోటనే ఉండటం వల్ల చాలా ప్రాంతాలు వెనుకబడ్డాయి. వందేళ్ల క్రితమే కుదిరిన శ్రీబాగ్ ఒప్పందంలో వికేంద్రీకరణ గురించే ప్రధానంగా ప్రస్తావించారు. పెద్దమనుషుల ఒప్పందంలోనూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ కూడా పరిపాలన వికేంద్రీకరించాలని సూచించింది. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపులతో దీనిపై అధ్యయనం చేసింది. ఆ కమిటీలూ అదే విషయాన్ని సూచించాయి. ప్రభుత్వం మంత్రులు, అధికారులతో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ సూచనలు అంగీకరించింది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులను ప్రతిపాదిస్తున్నాం.' అని బుగ్గన తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతోనే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తున్నామని బుగ్గన స్పష్టంచేశారు.

మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయం

రాజధాని పేరుతో కిందటి ప్రభుత్వం రియల్ ఎస్టే ట్ వ్యాపారం చేసిందని బుగ్గన విమర్శించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధికి లక్షకోట్లు కావాలని కిందటి ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. ఐదువేల కోట్లు ఖర్చుచేసి అన్నీ తాత్కాలిక భవనాలు కట్టారని.. శాశ్వత కట్టడాలు ఏమీ లేవని బుగ్గన అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతోనే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తున్నామని ఉద్ఘాటించారు.

ఇవీ చదవండి..

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన తెదేపా నేతలు అరెస్ట్

Intro:Ap_gnt_62_20_velagapudi_nalla_baloons_nirsana_avb_AP10034

Contributor : k. vara prasad (prathipadu),guntur

( గమనిక : విజువల్స్ కిట్ 620 నుంచి లైవ్ లో వచ్చాయి . గమనించగలరు)

Anchor : రాజధాని అమరావతిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరు జిల్లా వెలగపూడిలో గ్రామస్థులు నల్ల బూరలను గాలిలోకి వదిలారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఎంత మందిని పెట్టుకున్న అసెంబ్లీని అడ్డుకుని తీరుతామని గ్రామస్తులు హెచ్చరించారు.

బైట్ : 1
2
3
4

Body:end

Conclusion:end
Last Updated : Jan 20, 2020, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.