Covid Vaccination at home: తెలంగాణలో ఇంటింటికీ వెళ్లాలని.. పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇళ్లకు వచ్చినప్పుడు అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో సమీక్ష జరిగింది.
రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోస్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. మంకీపాక్స్‌పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని హరీశ్ స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు సైతం కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.
ఇవీ చూడండి..