ETV Bharat / city

జూన్ 22లోపు నన్ను చంపేస్తామన్నారు: బొండా ఉమా

author img

By

Published : Jun 15, 2020, 12:58 PM IST

Updated : Jun 15, 2020, 1:09 PM IST

తెదేపాలోని కొంత మంది నేతల హత్యకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నేత బొండా ఉమామహేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన నేతలకు ఏమైనా జరిగితే వైకాపా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. విజిలెన్స్ దర్యాప్తు నివేదికలో అచ్చెన్నాయుడికి సంబంధముందని ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

bonda uma
bonda uma

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈఎస్​ఐ స్కాంలో అచ్చెన్నాయుడికి సంబంధముందని విజిలెన్స్ దర్యాప్తులో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు అచ్చెన్నాయుడిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అవినీతి జరిగినందునే అరెస్టు చేశామని వైకాపా నేతలు చెబుతుండటం దారుణమన్నారు.

బొండా ఉమామహేశ్వరరావు

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్న బొండా ఉమా...ప్రభుత్వ వైద్యులపై దాడులకు దిగుతోందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల దాడులకు దిగారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కొంత మంది నేతల హత్యకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలకు ప్రాణాలకు హానీ కలిగితే జగన్ ప్రభుత్వానిదే బాధ్యతవుతుందని హెచ్చరించారు. మంత్రులు హెచ్చరిస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదని ఆక్షేపించారు.

చాలా మంది నేతలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనతో పాటు బుద్దా వెంకన్నకు కాల్స్ వచ్చాయి. జూన్ 22లోపు నన్ను హత్య చేస్తామని చెప్పారు. తెదేపా నేతల హత్యలకు కొన్ని టీంలు ఏర్పాడ్డాయి. వీటిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. మా ప్రాణాలకు ముప్పు వస్తే జగన్ ప్రభుత్వానిదే బాధ్యత- బొండా ఉమామహేశ్వరరావు

ఇదీ చదవండి:

విశాఖ గ్యాస్ లీకేజీ : పరిహారం కోసం పడిగాపులు

Last Updated : Jun 15, 2020, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.