ప్రతిపక్ష పార్టీ నాయకులు, న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువు పోయిందని తెదేపానేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై దాడులు జరిగితే ఫిర్యాదు చేసినా పట్టించుకోని డీజీపీ.. ఫోన్లు ట్యాపింగ్‌పై ప్రధానికి చంద్రబాబు ఫిర్యాదు చేయగానే స్పందించటం హాస్యాస్పదమన్నారు.
- చర్చకు సిద్ధం..
ఎన్నికల ముందు డ్వాక్రాగ్రూపులకి ఏడు లక్షలు ఇస్తామని వాగ్దానం చేసి... ఇప్పుడు మాట మార్చి మహిళలకు టోపీ పెట్టారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నివాస స్ధలాల కొనుగోలులో జరిగిన అవినీతిపై బహిరంగ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల స్థలాల పంపిణీని తెదేపా అడ్డుకుంటోందని వైకాపా చేస్తున్న దుష్ప్రచారంపై తాము బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నామని సవాల్ చేశారు. మద్యం దుకాణాలకు లేని కొవిడ్ నిబంధనలు..వినాయక చవితి వేడుకలకి ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ వారం రోజులకు వాయిదా