ETV Bharat / city

పిట్టల కూత వినేద్దాం.. పక్షుల లెక్క తేల్చేద్దాం - Salim Ali Bird Count program 2020

మార్నింగ్ వాక్ కోసం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఏదో చెట్టు కొమ్మపై ఓ బుల్లిగువ్వ చాలా ముద్దొచ్చేలా కనిపిస్తుంటుంది. చాలా చిన్నిపాటి గొంతుతో శబ్దం చేస్తూ ఉంటుంది. సాయంకాలం పూట పిల్లలతో ఆడుకుంటుంటే వాళ్లేదో మరో చిన్నపక్షిని చూపిస్తారు. దాని రంగులు భలే ఉన్నాయని సంబరపడిపోతుంటారు. అలాంటి రంగురంగుల పక్షులు, పేరుతెలియని గువ్వలు ఎన్నో మన పరిసరాల్లోనే సంచరిస్తూ ఉంటాయి. కొన్ని అందమైన రంగులతో ఆకర్షిస్తుంటే మరికొన్ని వాటికే ప్రత్యేకమైన శబ్దాలు చేస్తూనో, ఆకట్టుకునే జీవనశైలితోనో అబ్బురపరుస్తాయి. అసలు ఇలాంటివి ఎన్ని పక్షులు ఉన్నాయి..? వాటిలో ఎన్ని జాతులు ఇంకా మనుగడ సాగిస్తున్నాయి. మరెన్ని ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి..? వాటి సంఖ్యను తెలుసుకోవటం ఎలా...? ఈ ప్రయత్నమే చేస్తోంది.. ది బోంబే నేచురల్ హిస్టరీ సొసైటీ.

Salim Ali Bird Count
సలీం అలీ బర్డ్ కౌంట్
author img

By

Published : Nov 4, 2020, 7:22 AM IST

Salim Ali Bird Count
సలీం అలీ బర్డ్ కౌంట్

ఈ నెల 12న ప్రఖ్యాత పక్షిశాస్త్రవేత్త, "బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా" గా పేరుగాంచిన సలీం అలీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 5 నుంచి నవంబర్ 12 వరకూ 'సలీం అలీ బర్డ్ కౌంట్ ' పేరిట జాతీయ స్థాయి ఈవెంట్​ను నిర్వహించాలని బోంబే నేచురల్ హిస్టరీ సొసైటీ నిర్ణయించింది. మహారాష్ట్రలో ఏటా వారం రోజుల పాటు నిర్వహించే పక్షి సప్తాహ్​ను ఇందులో మిళితం చేస్తూ ఈ సారి 8 రోజులు జరిగేలా ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రకృతి, పక్షులంటే ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరినీ ఇందులో భాగస్వామ్యం చేసేలా సిటిజన్ సైన్స్ ప్రోగ్రాంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

Salim Ali Bird Count
సలీం అలీ బర్డ్ కౌంట్

అందులో భాగంగా.. 8 రోజుల పాటు మనకి వీలయ్యే సమయాల్లో..మన పరిసరాల్లో కనిపించే విభిన్న రకాల పక్షులను వాటిని పరిశీలించటం, లెక్కపెట్టటం, ఫోటోలు తీయటం, వాటి ధ్వనులను వీలైతే రికార్డు చేయగలటం ద్వారా www.eBIRD.org/India అనే వెబ్ సైట్ లాగిన్ అయి నమోదు చేసే అవకాశాన్ని కల్పించింది.

ఎనిమిది రోజుల పాటు కనీసం రోజులో 15నిమిషాల పాటైనా ఉదయం, సాయంత్రం మన పరిసరాల్లో కనిపించే పక్షులను లెక్కపెట్టటం, వాటికి సంబంధించిన డేటాను వెబ్ సైట్ లో నిక్షిప్తం చేయటం ద్వారా వారి పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ శీతాకాలంలో మన ప్రదేశాల్లో ఎలాంటి పక్షులు వస్తున్నాయి.. ఎంత సంఖ్యలో వస్తున్నాయి.. వాటి జీవనశైలి ఎలా ఉంది..ఏమన్నా మార్పులు ఉన్నాయా అనే అంశాలను ఓ అంచనాకి వచ్చేందుకు పక్షి శాస్త్రవేత్తలకు వీలు కలగనుంది.

దీంతో పాటు పక్షుల జీవనశైలిని గమనించటాన్ని మన దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవటం ద్వారా వాటి ఉపయోగాలు తెలుసుకోవటం, వాటి ఆవశ్యకతను మనంతట మనమే గ్రహించగలటం ఈ కార్యక్రమం ఏర్పాటుకు ముఖ్య కారణంగా నిర్వాహకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా తర్వాతి తరాలకు వాటి ఆవశ్యకతను వివరించేందుకు దోహదపడుతుందని బోంబే నేచురల్ హిస్టరి సొసైటీ కోరుతోంది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో 3 మెగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.