ETV Bharat / city

Nagarjuna Sagar Boating Starts: సాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం ప్రారంభం - Nagarjuna Sagar And Srisailam Boat Journey timings

Sagar-Srisailam Boat journey starts: సాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం ప్రారంభమైంది. లాంచీ ప్రయాణానికి పర్యాటక అధికారులు పచ్చజెండా ఊపారు. కానీ.. టికెట్‌ డబ్బుల్లో తమకు 30శాతం చెల్లించాలంటూ.. అటవీశాఖ అధికారులు లాంచీని కాసేపు అడ్డుకున్నారు.

boating-journey-between-nagarjuna-sagar-and-srisailam-starts-from-today
నేటి నుంచి సాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం
author img

By

Published : Nov 29, 2021, 10:22 AM IST

Updated : Nov 29, 2021, 2:11 PM IST

Sagar-Srisailam Boat journey: ఎత్తైన కొండలు.. దట్టమైన అరణ్యమార్గం. వాటిని చీల్చుతూ పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మపై ప్రయాణం. తనివితీరా ప్రకృతి అందాలను ఆస్వాదించేలా సాగే శ్రీశైల యాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. రెండు నెలల క్రితమే ప్రారంభం కావాల్సిన నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం లాంచీకి ప్రయాణానికి పర్యాటకశాఖ అధికారులు ఉదయం 9 గంటలకు జెండా ఊపారు.

ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 588.80 అడుగులు ఉండడంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ టూర్‌కు పచ్చజెండా ఊపింది. తొలిరోజు 10మంది యాత్రికులతో బయలుదేరిన లాంచీ.... మధ్యాహ్నం 3గంటలకు శ్రీశైల క్షేత్రానికి (Sagar And Srisailam Boat Journey timings) చేరుతుంది. రాత్రి అక్కడే బసచేసి దైవ దర్శనం, దర్శనీయ స్థలాల సందర్శన తరువాత మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 3 గంటలకు లాంచీ సాగర్‌కు చేరుకుంటుందని పర్యాటక సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ ప్రయాణానికి(sagar to srisailam boating) ఆదివారం సాయంత్రం వరకు 60 టికెట్లు బుక్‌ అయినట్లు పేర్కొన్నారు.

తొలిరోజే కాసేపు బ్రేక్

తొలి రోజు ప్రారంభమైన లాంచీని కాసేపు అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. టికెట్‌ డబ్బుల్లో తమకు 30శాతం చెల్లించాలని కోరారు. పర్యాటకశాఖ సిబ్బందితో చర్చల అనంతరం... లాంచీని అనుమతించారు.

ఛార్జీల వివరాలు...

  • Nagarjuna Sagar to Srisailam Ticket Cost: సాగర్‌ నుంచి శ్రీశైలానికి ఒకవైపు పెద్దలకు - రూ.1,500, పిల్లలకు - రూ.1,200. (శ్రీశైలం నుంచి కూడా సాగర్‌కు కూడా ప్రయాణించే అవకాశం ఉంది)
  • రెండు వైపుల పెద్దలకు - రూ. 2,500, పిల్లలకు - రూ.2,000.
  • హైదరాబాద్‌ నుంచి బస్‌ ప్యాకేజీ సహా పెద్దలకు - రూ.3,999, పిల్లలకు - రూ.3,399

గతంలో హైదరాబాద్​ నుంచి బస్​ ప్యాకేజీ పెద్దలకు రూ. 2999, పిల్లలకు రూ.2,399 ఛార్జీలు వసూలు చేసేవారు. ప్రస్తుతం టికెట్ల రేట్లను రూ.1000 పెంచారు. ఆసక్తి ఉన్న పర్యాటకులు ఆన్​లైన్​లో పర్యాటక శాఖ వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

నాగార్జున సాగర్​ నుంచి మల్లన్న గట్టుకు లాంచీ సేవలు

Last Updated : Nov 29, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.