ETV Bharat / city

Black Fungus: రాష్ట్రంలో విస్తరిస్తున్న బ్లాక్‌ఫంగస్‌.. ఇప్పటివరకూ ఎందరికి సోకిందంటే..!

రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా సోకని వ్యక్తులూ ఈ వ్యాధి బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ నిర్ధరించింది. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకు వెయ్యి 179 మందికి బ్లాక్‌ఫంగస్‌ సోకింది. ఇప్పటివరకు రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌తో 14 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

Black fungus cases increasing in AP
రాష్ట్రంలో గుబులు రేపుతున్న బ్లాక్‌ఫంగస్
author img

By

Published : Jun 1, 2021, 9:20 AM IST

ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

కరోనా రెండో దశ ఇప్పటికీ ప్రజలను వణికిస్తుంటే..మ్యుకార్‌మైకోసిస్‌... అనే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ మరింత భయాందోళనకు గురిచేస్తోంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కనిపించే ఈ వ్యాధి.. ఇప్పుడు అనేక మందిలో కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు వెయ్యి 179 మంది బ్లాక్‌ఫంగస్‌ బారినపడ్డారు. కరోనా చికిత్సలో ఎక్కువ స్టిరాయిడ్లు వాడిన వారు ఈ వ్యాధి బారినపడ్డారని గతంలో నిపుణులు చెప్పారు. కానీ కరోనా నిర్దరణ కాకపోయినా.. ఎలాంటి స్టిరాయిడ్లు వినియోగించని వారిలోనూ... తాజాగా బ్లాక్‌ఫంగస్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

కృష్ణా జిల్లాల్లోనూ బ్లాక్‌ఫంగస్ కేసులు గుబులు రేపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని బాధితులకు కాకినాడ జీజీహెచ్‌లో మాత్రమే ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు 100 మందికి పైగా రోగులు బ్లాక్‌ఫంగస్‌తో ఆస్పత్రిలో చేరారు. వీరిలో ప్రస్తుతం 68 మంది జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఆరుగురు రోగులు బ్లాక్‌ఫంగస్‌తో చనిపోయారు. వైద్య నిపుణుల బృందం పరిశీలన అనంతరం మాత్రమే ప్రత్యేక ఔషధాలు వినియోగించాలని బాధితులకు వైద్యులు చెబుతున్నారు.

బ్లాక్‌ఫంగస్‌ చికిత్స కోసం అవసరమైన ఔషదాలను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. కరోనా వ్యాధి గ్రస్తులకు ఉపయోగించే స్టిరాయిడ్ల వినియోగంపై ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల్లో.. 63% మంది మధుమేహులే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.