ETV Bharat / city

Somu Veerraju On Chandrababu: చంద్రబాబు పొత్తు వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఏమన్నారంటే..!

author img

By

Published : Jan 7, 2022, 4:05 PM IST

Updated : Jan 7, 2022, 8:56 PM IST

somu veerraju on chandrababu: అవసరం వచ్చినప్పుడు చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారని.. ఆ తర్వాత వదిలేస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గురువారం జనసేనతో పొత్తు విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.

bjp state president somu veerraju
bjp state president somu veerraju

somu veerraju on chandrababu: తెదేపా అధినేత చంద్రబాబుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు అంశంపై చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై ఆయన స్పందించారు. చంద్రబాబు అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా లవ్ చేస్తారని.. ఆ తర్వాత వదిలేస్తారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రవ్యాప్తంగా భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ జపంలో భాగంగా.. విజయవాడ అమ్మవారి సన్నిధిలో జపం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతాలోపాలపై ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండను దేశం మొత్తం గమనించిందన్నారు. మోదీ పాలనలో అవినీతికి అస్కారం లేకుండా పాలన చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. పంజాబ్ ఘటనపై ఇవాళ రాష్ట్ర గవర్నర్​ను కలుస్తామని చెప్పారు.

ఇదీ చదవండి :

RRR comments on his resignation: త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: రఘురామ

Last Updated : Jan 7, 2022, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.