ETV Bharat / city

అక్రమ అరెస్టు‌లకు నిరసనగా ఉద్యమం మరింత తీవ్రతరం: సోము వీర్రాజు

author img

By

Published : Sep 19, 2020, 3:23 PM IST

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల మీద జరుగుతున్న దాడులు... హిందూ యువకుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

BJP state president Somu veeraju  comments on police arrests
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

అంతర్వేది ఘటనలో చర్చిపై దాడి చేశారంటూ... కొందరు హిందూ యువకులపై అక్రమ కేసులు నమోదు చేసి... దోషులు ఎవరనేది గుర్తించకుండా పోలీసులు వేధింపులకు గురి చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఈ చర్యలకు నిరసనగా తాము తలపెట్టిన చలో అమలాపురం కార్యక్రమానికీ అడ్డుతగిలి... ఎక్కడికిక్కడ తమ పార్టీ శ్రేణులను పోలీసులు అక్రమ గృహనిర్బంధంలో ఉంచారన్నారు.

పోలీసులతో ప్రభుత్వం చేయించిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లాల వారీగా అనేకమంది నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారని... ముఖ్యమైన నాయకులను, పార్టీ ప్రముఖులను పోలీసుస్టేషన్​లో ఉంచడం... పోలీసు వాహనాల్లో కిలోమీటర్ల కొద్దీ తిప్పడం వంటి చర్యలు సరైనవి కావన్నారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా తమ ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని వీర్రాజు అన్నారు.

ఇదీ చదవండి: 'ఎస్సీల మీద దాడులపై సీబీఐతో దర్యాప్తు చేయించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.