లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగుల పట్ల వ్యవహరించిన తీరు ప్రభుత్వ అసమర్థతను బయటపెట్టిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అక్కడ వసతి గృహాలు ఖాళీ చేయించిన విషయం... ఎన్వోసీలు ఇచ్చి పంపిస్తున్న విషయం తెలిసినా కనీస చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రే కరోనా పట్ల తేలిగ్గా మాట్లాడిన పరిస్థితుల్లో... అధికారులెవరూ స్పందించే ధైర్యం చేయలేకపోతున్నారని అన్నారు.
ప్రభుత్వ అసమర్థతతో వేలాది మంది విద్యార్థులు రోడ్డున ఉండిపోయారని వ్యాఖ్యానించారు. అర్థరాత్రి సమయంలో వారిదారిన వారిని వదిలేయటమేంటని ప్రశ్నించారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో పేదలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉచిత రేషన్, కందిపప్పు, వెయ్యి రూపాయల నగదు త్వరగా అందించాలని తాను లేఖ రాసినా ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహించారు.
ఇదీ చదవండి: