ETV Bharat / city

'సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా హైదరాబాద్' - తెలంగాణ వార్తలు

హైదరాబాద్ సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)​ అన్నారు. ఇంటెలిజెన్స్, హోంమంత్రి ఏమయ్యారో కేసీఆర్ (CM KCR) చెప్పాలని డిమాండ్​ చేశారు.

బండి సంజయ్
బండి సంజయ్
author img

By

Published : Jul 9, 2021, 3:48 AM IST

తెరాస ప్రభుత్వంపై బండి ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) విరుచుకుపడ్డారు. హైదరాబాద్ సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఇంటెలిజెన్స్, హోంమంత్రి ఏమయ్యారో కేసీఆర్ (CM KCR) చెప్పాలని డిమాండ్​ చేశారు. కేంద్ర వాటాలేని సంక్షేమ పథకాలు ఏంటో సీఎం చెప్పాలన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని చెప్పారు. కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా దక్కడంతో ప్రజల్లో విశ్వాసం వచ్చిందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత అమిత్‌ షాను కేసీఆర్‌ కలిశారని తెలిపారు. మేయర్‌ పదవి భాజపాకే ఇస్తామని అమిత్ షాతో అన్నట్లు బండి సంజయ్​ చెప్పారు.

హైదరాబాద్ నగర శివారు దమ్మాయిగూడలో మూడేళ్ల చిన్నారిపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడం అత్యంత అమానుషమని బండి సంజయ్‌ మండిపడ్డారు. ప్రస్తుతం బాధిత చిన్నారని ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోందని అయన అవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగి మూడు రోజులైనా నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచార నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెరాస పాలనలో హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయని.. దోషులు యథేచ్ఛంగా తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

'దేశం కోసం పనిచేసే పార్టీలు ఏవో ప్రజలు ఆలోచించాలి. భాజపా త్యాగానికి వెనకాడదు. రాష్ట్రంలో ఆరాచక పాలన కొనసాగుతోంది. అవినీతి పాలన నడుస్తోంది. కుటుంబ పాలనను అంతమొందించాలి. 299 టీఎంసీలకు సీఎం కేసీఆర్​ ఒప్పుకున్నారు. 299 టీఎంసీలకు కేసీఆర్​ సంతకం పెట్టారు. ఈ రోజు కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర నిధులతో రైతు వేదిక, శ్మశాన వాటిక, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వ్యాక్సిన్​ కూడా కేంద్రమే ఇస్తోంది. కరోనా విజృంభిస్తుంటే సీఎం స్పందించలేదు. హైదరాబాద్​లో వరదలు వచ్చినా బయటకు రాలేదు.

-బండి సంజయ్​, భాజపా తెలంగాణ అధ్యక్షుడు

ఇదీ చదవండి:

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలువరించండి: కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ

కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.