ఆంగ్ల మాధ్యమం కారణంగా... విద్యార్థులు ఎటూ కాకుండా పోతారని భాజపా ఎంపీ సుజనా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు శిక్షణ లేకుండా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇతర అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపైనా సుజనా చౌదరి విమర్శలు గుప్పించారు. వైకాపా ప్రభుత్వం పాలనపై కాకుండా... కక్ష సాధింపులపైనే ఎక్కువగా దృష్టిపెట్టిందని ఆరోపించారు. రాజు మారగానే... రాజధానితో సహా.. ప్రాజెక్టులన్నీ ఆపేశారని విమర్శించారు.
హామీలు సరే...నిధులు ఎలా తెస్తారు..?
ఒక్క మతానికే ఎక్కువగా రాయితీలు ఇస్తే... ప్రజల మధ్య మనస్పర్థలు వస్తాయని సుజనా వ్యాఖ్యానించారు. మత సంబంధ సంస్థల నుంచి రాయితీలు ఇచ్చుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని... ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వొద్దని అభిప్రాయపడ్డారు. ఆర్నెళ్లుగా కేంద్రాన్ని ఏ విషయం గురించి అడగలేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అడుగుతామని... దాని గురించే మరిచిపోయారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోతే... కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రావని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు కానీ... నిధులు ఎక్కడ్నుంచి తెస్తారో చెప్పడంలేదన్నారు.
ఇదీ చదవండి : వైకాపా ఎంపీని పలకరించిన ప్రధాని మోదీ