సీఎం జగన్‌ను భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కలిశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తానని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. ప్రతిదాన్ని ప్రైవేటీకరించడం మంచిది కాదన్నారు. గతంలో ఎయిరిండియా ప్రైవేటీకరణనూ వ్యతిరేకించానని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.
సర్కారు వ్యాపారం చేయవచ్చా లేదా అనేదాన్ని కేస్ బై కేస్ చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. తితిదేను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చాలన్న స్వామి.. తితిదే ఖాతాలను కాగ్‌తో ఆడిట్ చేయించాలన్న సీఎం నిర్ణయం బాగుందని చెప్పారు. తితిదేను భక్తులే నడిపించేలా తీర్చిదిద్దాలని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. పెట్రో ధరల పెరుగుదల ప్రజలకు భారంగా మారిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... 'నా ఓటెక్కడ..?' డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు మిస్సింగ్