ETV Bharat / city

సోము వీర్రాజు అలా.. సుజనా ఇలా.. ట్విట్టర్​లో మరోలా..! - భాజాపా తాజా వార్తలు

రాజధాని అమరావతి విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నేతల ప్రకటనలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. గురువారం ఈ విషయం గురించి మాట్లాడిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. ఆ కాసేపటికే భాజపా రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి... కేంద్రం సరైన సమయంలో అమరావతిపై జోక్యం చేసుకుని సరైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత... సుజనా చౌదరి వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని, రాజధాని అమరావతిలో కొనసాగింపు, రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదని... భాజపా రాష్ట్ర పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో మరో పోస్టు దర్శనమిచ్చింది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

BJP Leaders different comments on Amaravathi

author img

By

Published : Jul 30, 2020, 11:19 PM IST

రాజధాని విషయంలో రైతులకు అండగా నిలుస్తాం. తమ వైఖరిలో మార్పులేదు. కేంద్రం ఇందులో జోక్యం చేసుకోబోదు. ప్రాంతీయ పార్టీల రాజకీయ చదరంగంలో తాము చిక్కుకోబోం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానిస్తేనే ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారు.అమరావతిపై చంద్రబాబు హామీల్లో కేంద్రం ఏనాడూ జోక్యం చేసుకోలేదు.

- సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానులను పెంచుకుంటూ పోవడం సరికాదు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5, 6లకు విరుద్ధంగా రాజధాని విభజన అంశాన్ని గవర్నర్ వద్దకు ప్రభుత్వం తీసుకెళ్లింది. న్యాయసమీక్ష లేకుండా ఈ విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోరు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు, న్యాయ స్థానాలు చూస్తూ ఊరుకోవు. రాజ్యసభ ఎంపీగా చెబుతున్నా.. కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుని సరైన నిర్ణయం తీసుకుంటుంది.

- సుజనా చౌదరి, భాజపా ఎంపీ

భాజపా రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి చెప్పినట్టు రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది అనటం పార్టీ అభిప్రాయం కాదు. పార్టీ అభిప్రాయం అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో కొనసాగింపు, అలాగే రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదు.

-భాజపా రాష్ట్ర పార్టీ అధికారిక ట్విట్టర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.