ETV Bharat / city

'స్వప్రయోజనాల కోసం వైకాపా ..మోదీని అడ్డు పెట్టుకుంటుంది' - తెదేపా, వైకాపా ప్రభుత్వాలు దొందూదొందే

తమ స్వప్రయోజనాల కోసమే వైకాపా...మోదీని అడ్డం పెట్టుకోవటానికి యత్నిస్తోందని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తెదేపా, వైకాపా పార్టీలు దొందూదొందే...అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

bjp kanna
author img

By

Published : Aug 22, 2019, 8:58 AM IST

'స్వప్రయోజనాల కోసం వైకాపా ..మోదీని అడ్డం పెట్టుకుంటుంది'
bjp-kanna-comments-on-ysrcp

తెదేపా, వైకాపా ప్రభుత్వాలు దొందూదొందే అంటూ భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్‌లో విమర్శించారు. విపరీతమైన అవినీతితో కేంద్ర నిధులు మాయం చేసింది ఆనాటి తెదేపా ప్రభుత్వమని ఆరోపించారు. ప్రధాని మోసం చేశారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం ప్రధానిని అడ్డం పెట్టుకోవటానికి యత్నిస్తోందని అన్నారు. వైకాపా ప్రభుత్వం తనకే నమ్మకం లేక ఇలా వ్యవహరిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు.

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

అగ్ని ప్రమాదం నివారణపై అవగాహన ఎంతో అవసరం.

అగ్ని ప్రమాదాల నివరణతో పాటు ఆ ప్రమాదం జరిగినప్పుడు మంటలను అదుపు చేయడం, అనుకోకుండా సంభవించే అగ్ని ప్రమాదాల నివారణ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండటం అవసరమని అగ్నిమాపక అధికారి బసవరాజు తెలిపారు. ఉరవకొండలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పట్టణంలోని గ్యాస్ గోడౌన్ ఆఫీసు దగ్గర గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెలరేగినప్పుడు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ స్పందించే తీరును ప్రయోగాత్మకంగా వివరించారు. స్థానికంగా ఉన్న అవకాశాలతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయడం పై ప్రతి ఒక్కరు చైతన్యులు కావాలి అన్నారు. సిలిండర్ నుండి మంటలు వచ్చినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ ను ఉపయోగించి మంటలను ఆర్పి విధానాన్ని తెలియజేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలి, ప్రాణాపాయం సంభవించకుండా ప్రథమ చికిత్స ఎలా అందించాలి, లైఫ్ జాకెట్లు వల్ల కలిగే ప్రయోజనం అంశాలను వివరించారు. అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా చేసిన విన్యాసాలు స్థానికులను ఆకట్టుకున్నాయి.

Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, ananthapuram (D)
date : 18-04-2019
sluge : ap_atp_71_18_fire_incidents_mock_drill_av_c13
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.