ETV Bharat / city

Somu Veerraju slams YCP Govt : నిధులు కేంద్రానివి.. ప్రచారం జగన్​ది : సోము వీర్రాజు

author img

By

Published : Jan 2, 2022, 3:16 PM IST

Somu Veerraju slams YCP Govt: రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పథకాలకు కేంద్రం నిధులిస్తుంటే.. జగన్ తన సొంత పథకాల పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.

Somu Veerraju Fires on CM YS Jagan
Somu Veerraju Fires on CM YS Jagan

Somu Veerraju slams YCP Govt: కేంద్రం నిధులు ఇస్తుంటే.. జగన్ తన సొంత పథకాల పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో స్థానిక నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్మిస్తున్న జగన్ కాలనీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతున్నాయని స్పష్టం చేశారు. దాదాపు 35 వేల కోట్ల రూపాయలు పేదల ఇళ్ల కోసం ఇస్తున్నామని చెప్పారు. అయితే.. కేంద్రం నిధులు ఇస్తుండగా, వాటికి పేరు మాత్రం జగన్ పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ జోక్యం తగదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

"కేంద్రం నిధులిస్తే జగన్ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని ఆదాయ వనరుగా చేసుకుని ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ జోక్యం తగదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తాం" - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి :

CM JAGAN DELHI TOUR: రేపు దిల్లీకి సీఎం జగన్... ప్రధాని మోదీతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.