ETV Bharat / city

కాకర.. వ్యాధినిరోధక శక్తి పెంపుకు ఆసరా! - కాకర.. వ్యాధినిరోధక శక్తి పెంపుకు ఆసర..

వర్షాకాలంలో జలుబూ, దగ్గు బారినపడటం సహజమే. వాటి బారిన పడకుండా ఉండాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. కాకరకాయతోనూ కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

bitter guard helps to increase immunity power
కాకర.. వ్యాధినిరోధక శక్తి పెంపుకు ఆసర..
author img

By

Published : Jul 3, 2020, 8:04 PM IST

  • కాకరలో పీచు ఎక్కువగా ఉంటుంది. దాంతో జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడమే కాకుండా అధిక బరువునూ నియంత్రిస్తుంది.
  • విటమిన్‌-సి, ఎ, ఫొలెట్‌, పొటాషియం, జింక్‌, ఇనుము నిండుగా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లోని విటమిన్‌-సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనత దరిచేరదు.
  • విటమిన్‌-ఎ పుష్కలంగా ఉండే కాకర తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. కంటిచూపు చురుగ్గా ఉంటుంది. దీంట్లోని ఫొలెట్‌ పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
  • ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించే ఇన్సులిన్‌ని తగుమోతాదులో అందిస్తుంది.
  • ఉదర, పేగు, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లతో పోరాడే లక్షణాలు దీనికి ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరో నాకు తెలియదు: ఎంపీ విజయసాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.