ETV Bharat / city

రాష్ట్రంలో సంపూర్ణంగా భారత్ బంద్ - Bharath band live page

Bharath band live page
Bharath band live page
author img

By

Published : Dec 8, 2020, 6:44 AM IST

Updated : Dec 8, 2020, 6:40 PM IST

14:15 December 08

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై పునరాలోచన చేయాలి: ఎంపీ రామ్మోహన్‌

  • శ్రీకాకుళం: తెదేపా తరఫున డీఆర్వో దయానిధికి వినతిపత్రం అందించిన రామ్మోహన్‌నాయుడు
  • కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై పునరాలోచన చేయాలి: ఎంపీ రామ్మోహన్‌
  • కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల్లో స్పష్టమైన ప్రకటన చేయలేదు: ఎంపీ రామ్మోహన్‌
  • మార్కెట్ కమిటీ యార్డులపై సూచన చేయకపోతే నిర్వీర్యమైపోతాయి: ఎంపీ రామ్మోహన్‌
  • కేంద్ర ప్రభుత్వం రైతులతో జరుపుతున్న సంప్రదింపుల్లో అన్నదాతల సూచనలు తీసుకోవాలి
  • పార్లమెంటులో కేంద్రంపై మాట్లాడేందుకు వైకాపా భయపడుతుంది.
  • రాజీ లేకుండా తెదేపా వాణిని పార్లమెంటులో వినిపిస్తున్నాం.

13:46 December 08

భారత్​ బంద్​లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌.. రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, విద్యాసంస్థలు మూసివేశారు. జాతీయ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించడంతో పాటు.. ఆందోళనల్లో పాల్గొంటున్నాయి.

13:42 December 08

దివిసీమలో బంద్ ప్రశాంతం

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దివిసీమలో బంద్ ప్రశాంతంగా జరిగింది. వామపక్షాలు, రైతు సంఘం నాయకులు, తెదేపా, కాంగ్రెస్, వైకాపా నాయకులు కార్యకర్తలు బంద్​కు మద్దతుగా నిరసన తెలిపారు. 

12:35 December 08

దేశ చరిత్రలో నిలిచిపోయే ఉద్యమమిది: మాజీ మంత్రి సోమిరెడ్డి

  • రైతులకు యావత్ భారతదేశం మద్దతు పలుకుతోంది: సోమిరెడ్డి
  • రైతులకు ప్రయోజనాలు కలిగించే కొత్త చట్టాలు తేవాలి: సోమిరెడ్డి
  • మార్కెటింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి: మాజీ మంత్రి సోమిరెడ్డి
  • రైతు సంఘాలతో చర్చించి కొత్త చట్టాలను తేవాలి: సోమిరెడ్డి

12:15 December 08

రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాలి: లక్ష్మీనారాయణ

  • విశాఖ: మద్దిలపాలెం జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ నిరసన
  • నిరసన సమయంలో కారులో వెళ్తున్న సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ
  • సంఘీభావం ప్రకటించాలని లక్ష్మీనారాయణను కోరిన కాంగ్రెస్‌ నాయకులు
  • కారు దిగి రైతులకు సంఘీభావం తెలిపిన సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ
  • బిల్లు విషయంలో మరోసారి చర్చ జరగాలి: లక్ష్మీనారాయణ

12:13 December 08

అమరావతి రైతుల ఆందోళన

  • వెలగపూడి దీక్షా శిబిరం వద్ద అమరావతి రైతుల ఆందోళన
  • భారత్ బంద్‌కు మద్దతుగా అమరావతి రైతుల మానవహారం
  • కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్

12:13 December 08

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన

  • అమరావతి: మల్కాపురం కూడలి వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన
  • సచివాలయానికి వెళ్లే మార్గంలో బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు
  • కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • అమరావతి: కేంద్రానికి, భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు

11:48 December 08

బోసిపోయిన సచివాలయం

భారత్ బంద్ ప్రభావంతో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం బోసి పోయింది. బంద్​కు మద్దతు తెలిపిన రాష్ట్రప్రభుత్వం.. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మూసి వేయాలని , ఆర్టీసీ బస్సు సర్వీసులనూ నిలిపి వేయాలని ఆదేశించింది. దీంతో ఉద్యోగులు, సందర్శకులు రాక సచివాలయం ప్రాంగణం నిర్మాణుష్యంగా మారింది. గుంటూరు, విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులను నిలిపివేయడంతో ఉద్యోగులు కార్యాలయాలకు రాలేదు. అత్యవసర విభాగాల ఉద్యోగులు మాత్రం ద్విచక్ర వాహనాలపై సచివాలయానికి వచ్చారు. బంద్ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సచివాలయ ప్రాంగణంలో పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు, నిఘా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం తర్వాతే సచివాలయానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్దరించడం, కార్యాలయాలు తెరచుకోనుండటంతో అప్పట్నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

11:42 December 08

అనకాపల్లిలో ప్రజాసంఘాల భారీ ర్యాలీ

విశాఖ జిల్లా అనకాపల్లిలో వామపక్షాలు, ప్రజాసంఘాలు, సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేస్తున్నారు. అన్ని రకాల దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులన్నీ బస్టాండ్లలోనే నిలిచిపోయాయి. 

11:42 December 08

రాజమహేంద్రవరం, కాకినాడలో వామపక్షాలు భారీ నిరసనలు

కాకినాడ, రాజమహేంద్రవరంలో వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పిఠాపురం, రాజోలు, పెద్దాపురం, రామచంద్రాపురంలో కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 9 ఆర్టీసీ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. దుకాణాలు, విద్యాసంస్థలు మూసివేశారు. 

10:42 December 08

పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి దిగ్బంధం

  • తిరుపతి: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి దిగ్బంధం
  • తిరుపతి శివారు తనపల్లి క్రాస్ వద్ద వాహనాలు నిలిపివేసిన వామపక్షాల నాయకులు

10:38 December 08

కర్నూలులో దుకాణాలు బంద్

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారత్ బంద్‌ సందర్భంగా.. వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. నంద్యాల బస్టాండ్ సమీపంలో నిరసన చేపట్టిన వామపక్షాల నేతలు.. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

10:37 December 08

అనంతపురంలో ఎడ్ల బళ్లతో వామపక్ష నేతలు నిరసన

అనంతపురంలో ఎడ్ల బళ్లతో వామపక్ష నేతలు నిరసన చేశారు. జిల్లావ్యాప్తంగా చిరువ్యాపారులు బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు పలికి.. దుకాణాలను మూసివేశారు. కదిరిలో భారత్ బంద్ ప్రభావం నామమాత్రంగా కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు మినహా మిగతా అన్ని కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. రాయదుర్గంలోనూ బంద్ కొనసాగుతోంది.

10:37 December 08

కడప జిల్లాలో భారత్ బంద్

కడప జిల్లాలోనూ భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్లిన బస్సులు.. తిరిగి బయటకు రాకుండా వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. మొత్తం మీద 900 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. కడపలోని కోటిరెడ్డి , ఏడురోడ్ల, అంబేడ్కర్, అప్సర కూడళ్ల వద్ద వాహనాలను అడ్డుకుంటున్నారు. కడప నుంచి తిరుపతి మార్గంలో ఆందోళనలు చేస్తున్నారు. భారత్ బంద్ కారణంగా.. యోగివేమన విశ్వవిద్యాలయంలో ఇవాళ జరగాల్సిన డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షను 22వ తేదీకి వాయిదా వేశారు. జిల్లావ్యాప్తంగా దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.

10:36 December 08

తిరుపతిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వామపక్షాలు ఆందోళన

తిరుపతి బస్టాండ్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పూర్ణకుంభం కూడలిలో రహదారిని దిగ్బంధం చేశారు. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ బస్సు సర్వీసులు నిలిపివేయగా.... తిరుమల వెళ్లే బస్సులకు మాత్రం బంద్‌ నుంచి మినహాయింపునిచ్చారు.

10:32 December 08

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు జిల్లా నాయుడుపేట కూడలి ఆర్టీసీ బస్టాండ్‌ బోసిపోయింది. డిపోల నుంచి బస్సులు రాకపోవడంతో....ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు....ప్రభుత్వ కార్యాలయాల వద్ద వేచి చూస్తున్నారు. 

10:32 December 08

శ్రీకాకుళం జిల్లాలో..

శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా బంద్‌ కొనసాగుతోంది. వామపక్షాలు, రైతు, కార్మిక సంఘాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పాలకొండ, టెక్కలి, పలాస డిపోల నుంచి బస్సులు మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

10:12 December 08

గుంటూరులో రహదారిపై కాంగ్రెస్‌, సీపీఎం నేతల బైఠాయింపు

  • గుంటూరు శంకర్ విలాస్ కూడలి వద్ద కాంగ్రెస్‌, సీపీఎం నేతల బైఠాయింపు
  • మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్

10:00 December 08

చిత్తూరులో కాంగ్రెస్ శ్రేణుల నిరసన

  • చిత్తూరు: కుప్పంలో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు
  • డీసీసీ అధ్యక్షుడు సురేష్‌బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన

09:59 December 08

విశాఖలో బంద్ ప్రశాంతం

విశాఖ: భారత్‌ బంద్‌ దృష్ట్యా రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు

డిపోలకే పరిమితమైన 270 బస్సులు, 430 సిటీ సర్వీసులు

09:32 December 08

చీరాలలో వామపక్షాల ర్యాలీ

ప్రకాశం: భారత్ బంద్ సందర్భంగా చీరాలలో వామపక్షాల ర్యాలీ

ప్రకాశం: దుకాణాలు, వ్యాపార సముదాయాలను మూయిస్తున్న వామపక్షాలు

09:31 December 08

ప్రభుత్వ ఆదేశాలతో విద్యాసంస్థలు బంద్

భారత్ బంద్ కారణంగా విద్యాసంస్థలు మూసివేయాలని నిర్ణయం: మంత్రి సురేష్‌

ప్రభుత్వ ఆదేశాలతో విద్యాసంస్థలు మూసివేస్తూ నిర్ణయం: మంత్రి సురేష్‌

ప్రశాంత వాతావరణంలో రైతులు బంద్ జరుపుకోవాలి: మంత్రి సురేష్‌

09:31 December 08

శ్రీకాకుళంలో నిలిచిపోయిన 300 బస్సులు

శ్రీకాకుళంలో వామపక్షాలు, రైతు, కార్మిక సంఘాలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ

శ్రీకాకుళం జిల్లాలో డిపోల వద్ద నిలిచిపోయిన 300 బస్సులు

09:05 December 08

తిరుమల వెళ్లే బస్సులకు బంద్ నుంచి మినహాయింపు

  • తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సు సర్వీసులు
  • తిరుపతి: మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిలిచిపోనున్న బస్సులు
  • తిరుమల వెళ్లే బస్సులకు బంద్ నుంచి మినహాయింపు

08:33 December 08

కడపలో దుకాణాలు మూసివేత

కడప ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వామపక్ష నేతల బైఠాయింపు

కడప: వ్యాపార వాణిజ్య సంస్థలు, దుకాణాలు మూసివేత

08:24 December 08

విజయనగరం జిల్లా

  • విజయనగరం జిల్లాలోని 4 డిపోల్లో నిలిచిన 360 ఆర్టీసీ బస్సులు
  • విజయనగరం: వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు మూసివేత

08:24 December 08

తిరుపతి బస్టాండ్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన

  • తిరుపతి: వామపక్షాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన
  • తిరుపతి పూర్ణకుంభం సర్కిల్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం
  • తిరుపతి: రహదారి దిగ్బంధం కారణంగా భారీగా నిలిచిన వాహనాలు

07:55 December 08

అనంతపురంలో భారత్‌ బంద్‌ సంపూర్ణం

  • ఆర్టీసీ డిపోల నుంచి బయటకు రాని బస్సులు
  • రైతులకు మద్దతుగా సహకరిస్తున్న ప్రజలు, సంస్థలు
  • రైతుల బంద్‌కు మద్దతుగా వామపక్షాల నిరసన

07:43 December 08

నెల్లూరు జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల్లో కదలని బస్సులు

  • భారత్‌ బంద్‌కు ఆర్టీసీ కార్మికుల మద్ధతు
  • ఆర్టీసీ గ్యారేజీలో నిలిచిపోయిన 840 బస్సులు
  • వ్యాపార సంస్థలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేత
  • రోడ్ల మీదకు రాని లారీలు, ఆటోలు
  • జాతీయరహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేత

07:43 December 08

  • మంగళగిరి బస్టాండ్ ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో

07:43 December 08

గుంటూరులో నిలిచిపోయిన 1200 ఆర్టీసీ బస్సులు

  • గుంటూరు జిల్లాలో నిలిచిపోయిన 1200కు పైగా ఆర్టీసీ బస్సులు
  • ఆటోలు, ఇతర ప్రజా రవాణా వాహనాలను అడ్డుకుంటున్న నిరసనకారులు
  • గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట సీపీఐ, విద్యార్థి, మహిళా సంఘాల నిరసన

07:42 December 08

కృష్ణా జిల్లాలో తెదేపా నిరసన

రైతుల డిమాండ్లకు పరిష్కారాన్ని కోరుతూ తెదేపా నిరసన

ఇవాళ కలెక్టరేట్ల వద్ద వినతిపత్రాలు ఇవ్వనున్న తెదేపా నేతలు

07:23 December 08

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ధర్నా

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ,విద్యుత్ ,వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ వామపక్ష పార్టీల నేతలు కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రామకృష్ణ,రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.

07:15 December 08

విజయవాడలో కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆప్‌, రైతుల సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

  • విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌, వామపక్ష నేతల నిరసన
  • కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆప్‌, రైతుల సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
  • విజయవాడ: సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత మధు, ఇతర నేతల బైఠాయింపు
  • విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • విజయవాడ: ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
  • విజయవాడ: మధ్యాహ్నం ఒంటిగంట వరకు బస్సులు నిలిపివేత
  • విజయవాడ: మధ్యాహ్నం వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత
  • భారత్‌ బంద్‌కు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాల మద్దతు

07:09 December 08

గుంటూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచే వెల్లువెత్తిన నిరసనలు

దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా.. గుంటూరులో వామపక్షాలు, ప్రజా సంఘాలు నేతలు నిరసన తెలిపారు. గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద తెల్లవారుజాము నుంచే నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులు బస్సులు ఆటోలను అడ్డుకున్నారు. భారత్ బంద్ కు సహకరించాలని కోరారు. మోదీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచేలా అనేక చట్టాలను చేసిందని సీపీఐ నాయకులు కోటా మాల్యాద్రి అన్నారు. అందులో భాగంగానే రైతుల హక్కులను కాలరాసేలా మూడు నూతన చట్టాలను తీసుకువచ్చిందిన్నారు. ఈ చట్టాలు వల్ల రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం నూతన చట్టాలను రద్దు చేసి రైతులకు సహకరించాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరాం చేస్తామని హెచ్చరించారు.
 
06:56 December 08

కడప జిల్లాలో 8 డిపోల్లో నిలిచిన 700 ఆర్టీసీ బస్సు సర్వీసులు

రైతుల, కర్షకుల కడుపు కొట్టే మూడు నల్ల చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదని కడప అఖిలపక్ష పార్టీ నాయకులు దస్తగిరి రెడ్డి, ఈశ్వరయ్యలు తెలిపారు. భారత్ బంద్ లో భాగంగా కడపలో తెల్లవారుజాము నుంచి బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బంద్ కు మద్దతు ఇవ్వడంతో దుకాణాలు అన్నింటినీ స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల్లో పరిధిలో ఉన్న 700 బస్సు సర్వీసులను నిలిచిపోయాయి. ఆందోళనకారులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద చేతిలో ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ ప్రవేశపెట్టిన చట్టాల వల్ల రైతు కూలీగా మారే అవకాశం ఉందన్నారు. మోదీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని ధ్వజమెత్తారు. తక్షణం ఈ చట్టాలను రద్దు చేయాలని.. లేదంటే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

06:49 December 08

ఒంగోలులో వామపక్షాలు నిరసన..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయం చట్టాలను వెనుక్కు తీసుకోవాలంటూ రైతులు తలపెట్టిన భారత్‌ బంద్​కు సంఘీభావంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో వామపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి. ఉదయం నుంచే ఆర్టీసీ డిపోలకు చేరుకొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులను మాత్రం తిరగేందుకు అనుమతించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను దుయ్యబెడుతూ నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని.. సోమనాథన్‌ కమిటీ రివార్డ్‌ ప్రకారం కనీస మద్దతు ధర చట్టబద్దం చేయాలని, కరెంట్‌ మోటార్లకు మీటర్లు ఏర్పాటు విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. వామపక్షాలతో పాటు కాంగ్రెస్‌ నాయకులు బంద్ లో పాల్గొన్నారు. 

06:47 December 08

విశాఖ-కలకత్తా జాతీయ రహదారి పై వామపక్షాలు నిరసన

విశాఖ మద్దిలపాలెం బస్ స్టాండ్ వద్ద వామపక్షాలు భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు బంద్ లో పాల్గొన్నాయి. విశాఖ-కలకత్తా జాతీయ రహదారి పై వామపక్షాలు నిరసన చేస్తున్నాయి. ఈ క్రమంలో మద్దిలపాలెం వద్ద జాతీయ రహదారి పై వాహనాలు నిలిచిపోయాయి.

06:43 December 08

గుంటూరులో సీపీఐ, విద్యార్థి, మహిళా సంఘాల నిరసన

  • గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఐ, విద్యార్థి, మహిళా సంఘాల నిరసన
  • గుంటూరు: మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్

06:15 December 08

ఏపీ లైవ్ అప్​డేట్స్: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్

  • వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా భారత్‌ బంద్
  • రాజకీయాలకు అతీతంగా భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు
  • దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ, కార్మిక సంఘాల మద్దతు
  • రైతులకు ప్రతిబింబమైన ఆకుపచ్చ జెండాలతో బంద్‌లో పాల్గొనాలని పిలుపు
  • ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా బంద్ నిర్వహించాలని పిలుపు
  • భారత్‌ బంద్‌కు మద్దతు తెలిపిన విదేశాల్లో ఉన్న భారతీయులు
  • తాము ఉంటున్న చోట్లే నిరసనలు వ్యక్తం చేస్తూ బంద్‌కు భారతీయుల మద్దతు
  • నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ కొన్నిరోజులుగా రైతుల ఆందోళనలు
  • కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల ప్రధాన డిమాండ్‌

Last Updated : Dec 8, 2020, 6:40 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.